Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వామిత్రుడు ఆనందం పట్టలేక, రామలక్ష్మణుల్ని గాఢంగా కౌగలించుకున్నాడు. మనసారా ఆశీర్వదించాడు.
‘మిథిలానరేశుడైన జనక మహారాజు ఒక క్రుతువును తలపెట్టాడు. ఆ క్రతువుకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ సందేశం వచ్చింది’ అంటూ విన్నవించుకున్నారు విశ్వామిత్రుని శిష్యులు.
విశ్వామిత్రుడు ఒక నిమిషం కళ్ళుమూసుకొని యోచించి, ‘‘సరే!’’ నంటూ ఒప్పుకున్నాడు.
జనకుని వద్ద అత్యంత ప్రాచీనమైన మహిమాన్వితమైన శివధనుస్సు ఒకటుంది. దాన్ని దర్శించుకోవడం కల్యాణదాయకం, ఆనందదాయకం. అందువల్ల మీరు నా వెంట రండి. దానిని దర్శించుకోండి’’అన్నాడు. వాళ్ళు సంతోషంగా కౌశికుని ఆహ్వానాన్ని స్వీకరించారు.
అలా, దశరథుని యజ్ఞంతో ఉద్భవించిన ఆ యజ్ఞశిశువులు, విశ్వామిత్ర యజ్ఞ పరిరక్షణానంతరం, జనకమహారాజు యజ్ఞానికి బయలుదేరారు. ఆ విధంగా వారి జీవితాలే మహాయజ్ఞాలుగా మారిపోయాయి.
అహల్య
మరునాడుదయం రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మళ్ళీ బయలుదేరారు. కొంతసేపటికి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. దారిలో వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమం కనిపించింది. తన శూన్యదృక్కుల్తో, దీనంగా శ్రీరాముని వంక చూచిందా ఆశ్రమం.
మట్టిముద్దో, మసిప్రోగో, రాతిముక్కో, ఎండిన మ్రోడో, తెలియని విధంగా, వివర్ణమై, జీవచ్ఛలంవలెనున్న ఒక మనుష్యాకృతిని పోలిన ఒక ఆకృతిని అక్కడ చూచాడు శ్రీరాముడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087