Others

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామ దేవతల పూజలకు ఉద్దేశితమైనది, తెలుగు జానపదుల సాంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. తెలంగాణ సంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటి చెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసాలలోవచ్చే ఆషాడం వచ్చిందంటే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో జాతరల సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శనమిస్తాయి. ప్రాచీనకాలంలో రుతువులు మారి, ఆషాఢంలో వర్షాలు కురిసి, వాతావరణ మార్పులతో కలరా, ప్లేగు లాంటి మహమ్మారి వ్యాధులు సంక్రమించే క్రమంలో, వైద్య సౌకర్యాలు లేని స్థితిలో దేవతలను కొలవడం జరిగేది. 1813లో భాగ్యనగరంలో వేలాదిమంది ప్లేగుకు గురైన సందర్భంలో మహంకాళిని కొలవడంతో వ్యాధి తగ్గుముఖం పట్టిందని, అప్పటినుండి రాష్ట్ర రాజధానిలోనూ బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు వాడుక. గోల్కొండ కోటలో జగదాంబికా ఆలయంలో అబుల్ హసన్ తానీషా పాలనా సమయంలో ప్రధాని, సైనికాధికారులుగా వున్న అక్కన్న, మాదన్నల కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు కథనాలు. 1908లో మూసీకి వరదలు వచ్చినపుడు, నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, మంత్రి కిషన్ ప్రసాద్‌ను ఏమి చేయాలో సలహా కోరగా, ఇది అమ్మవారి ఆగ్రహ ఫలితమేనని, ఆమెను శాంతింపజేయడానికి పూజలు నిర్వహించాలని మంత్రి, ప్రభువుకు వివరించిన సందర్భంలో నిజాం ప్రభువు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టువస్త్రాల సమర్పణతో పూజలు నిర్వహించారని, ఫలితంగా వరదలు తగ్గాయని చెపుతారు. తర్వాతికాలంలో స్థానికులు సదరు ఆలయాన్ని పునరుద్ధరించి, 1968లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులచే విగ్రహ ప్రతిష్ఠ చేయించడం జరిగింది. 7వ నిజాం కాలంనుండి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వందలాది చిన్నా పెద్ద ఆలయాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానంతరం తెలంగాణ సాంస్కృతిక వారసత్వ అనుసరణీయమైన పండగైన బోనాలును ‘రాష్ట్ర పండుగ’గా నిర్వహిస్తున్నారు. ‘్భజనం’ ప్రకృతి కాగా ‘బోనం’ దానికి వికృతి. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నివేదనాలే బోనాలు. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నాయకమ్మ మొదలైన పేర్లతో పిలిచే దేవతల గుళ్ళను ఈ సందర్భంగా దేదీప్యమానంగా అలంకరిస్తారు. బోనాన్ని కొత్త కుండలో వండి దానితోపాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిచోట్ల ఉల్లిపాయలతో కలిపిన బోనాన్ని మట్టి లేక రాగి గుండలలో ఉంచి, తమ తలలపై ఉంచుకుని ఆటగాళ్ళతో, డప్పుల తదితర వాద్యాలతో గుడికి చేరుకుంటారు. ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తడి (తెల్లముగ్గు)తో అలంకారం చేసి, దానిపై దీపాన్ని ఉంచుతారు. ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని గ్రామీణుల విశ్వాసం. అందుకే తమ కూతురు తమ స్వంతంటికి లేదా ఆమె పుట్టింటికి వచ్చిన భావనతో, ప్రేమానురాగాలు ఉట్టిపడగా, భక్తిశ్రద్ధలను మేళవించి బోనాలను నివేదిస్తారు. గత కొంతకాలంలో వేరు వేరు ప్రాంతాలలో దీనిని ‘పెద్దపండగ’, ‘ఊర పండుగ’ లాంటి పేర్లతో పిలిచేవారు. తర్వాతి కాలాన బోనాలుగా పిలుస్తున్నారు. పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు ఆలయ ప్రాంగణాన బలి ఇవ్వడం జరిగేది. నేడు యాటల పేరున, మేకలను లేదా కోడిపుంజులను బలిచేయడం ఆచారమైంది. పండుగ సందర్భంగా స్ర్తిలు కొత్త బట్టలు, పట్టుచీరలు, నగలు ధరించి బోనాలు మోస్తూ వెళుతుండగా, మోసుకెళుతున్న కొందరికి పూనకం (అమ్మవారు ఆవహిస్తారని నమ్మకం) రాగా, వారిని శాంతింపజేసేందుకై ఆలయ సమీపాన వారి పాదాలపై నీళ్ళు కుమ్మరిస్తారు. అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక బలిష్టకాయుడు ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్ళకు గజ్జెలు కలిగి, చిన్న ధోవతి ధరించి వాద్య ధనులకు అనుగుణంగా నర్తిస్తాడు. పూజారంభకునిగా, భక్తజన రక్షకునిగా భావించబడుతూ, కొరడాతో కొట్టుకుంటూ, వేపాకులను చుట్టుకుని, పూనకం వచ్చిన భక్తులను అమ్మవారి సన్నిధికి తీసుకెళతాడు. అమ్మవారికి నివేదనానంతరం విందు భోజనాలు ఆరగిస్తారు. ఈ కార్యక్రమంలో జాతర అనంతరం పోతరాజుకూ పూనకం రాగా, వికృతమైన ఆగ్రహాన్ని శాంతపరచుటకు కొమ్ములున్న మేకపోతును అందించగా, పోతరాజు తన దంతాలతో మేక తల, మొండం వేరుచేసి పైకి ఎగురవేస్తాడు. పండుగ మొదటిరోజునుండి చివరి నిమజ్జనం దాకా అత్యంత భక్తితత్పరతతో వాతావరణం నిండి వుంటుంది. బోనాల సమర్పణవల్ల ప్రధానంగా దేవతలు శాంతించి అంటురోగాల బారిన పడకుండా కాపాడుతారని అచంచల విశ్వాసం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494