Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదేమిటి?’’అంటూ దానిని తన కాలితో పలకరించాడు.
దాని పొరలూడి, తెరలూడి, తమస్సు వీడి, అప్సరాంగన వలె నున్న ఒక మునిపత్ని పుట్టుకొచ్చింది, రాముని పాదాల్లోంచి పుట్టినట్లుగా! నిద్రలోంచి లేచినట్లుగా లేచి, కళ్ళు నులుముకుంది. ఒళ్ళు విరిచింది. శ్రీరాముని దివ్య స్వరూపాన్ని గాంచింది. తననుతాను చూచుకొంది. తన చుట్టూరా ఉన్న పరిసరాలను పరికించింది. అటూ, ఇటూ పరిగెత్తింది.
‘‘నాథా! నాథా!’’అంటూ గొంతెత్తి అరచింది.
‘‘రామా! రామా!’’అంటూ ఏడ్చింది. నవ్వింది. శ్రీరాముని పాదాలపై బడి, కరిగి, కన్నీరై ప్రవహించింది.
ఆమెను లేవనెత్తి, ఆశీర్వదించి, అనునయించి, ఆమె కథనంతా విన్నాడు రాముడు.
ఆమె గౌతమమహర్షి ధర్మపత్ని అహల్యయనీ, మహర్షి లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషంలో వచ్చి, ఆమెను కలిశాడనీ, అప్పుడే తపస్సునుండి తిరిగి వచ్చిన గౌతముడు ఇంద్రుని మోసాన్ని గ్రహించి, అతన్ని విఫలుడై పొమ్మని శపించాడనీ, వెంటనే ఆతని వృషణాలు తెగి, నేలపై పడిపోయాయనీ, అప్పుడతడు అహల్యను, ‘‘నీవొక దీర్ఘకాలంపాటు, ఎవ్వరికీ కనిపించకుండా భస్మంలో భస్మంలా పడియుండి, ఆహార పానీయాలు లేకుండా, వాయు భక్షకివై తపస్సుచేసుకొంటూ, ఇచ్చటే నివసిస్తావు. శ్రీరాముని పాదధూళి సోకి, తిరిగి శాపవిముక్తి నందుతావు’’అంటూ శపించి, అనుగ్రహించాడనీ, నాటినుండీ, నేటిదాకా ఆమె శ్రీరాముని రాకకై ఎదురుచూస్తోందనీ తెలుసుకున్నాడు రాముడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087