Others

డైరెక్టర్స్ ఛాయిస్.. యాక్షన్ ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లఘు చిత్రం ఏఎస్‌ఎల్ ప్లీజ్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ భీమన. ఒక్క చిత్రానికి పది కోట్ల వ్యూస్ సాధించిన ఆ లఘు చిత్రంతో రామ్ కెరీరే మారిపోయింది. తొలి చిత్రం హమ్‌తుమ్‌తో టాలీవుడ్‌కు వచ్చి, వికెఏ ఫిలిమ్స్ పతాకంపై ‘ఆకతాయి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న
భీమనతో ఈవారం చిట్‌చాట్.
**
మీ నేపథ్యం?
గుంటూరులో పుట్టి పెరిగాను. ఎంఏ సైకాలజీ, ఐర్లాండ్ వర్శిటీలో యంబిఏతోపాటుగా స్క్రీన్‌ప్లే రైటింగ్ డిప్లమో, లండన్‌లో డిఎఫ్‌టి చేశా. హాలీవుడ్‌లో కొన్ని ఇంగ్లీష్ చిత్రాలకు అప్రెంటీస్ చేసిన అనుభవం ఉంది.
దర్శకుడిగా ఎలా?
స్కూలు దశనుంచే సినిమాపై కన్నుపడింది. ఓసారి పాఠశాక వేడుకకు అతిధిగా వచ్చిన సినీపెద్దకు ఇచ్చిన గౌరవాన్ని చూసి, దర్శకుడు కావాలని ఫిక్సయ్యా. చదవటం, రాయటం ఇష్టం.
ఇష్టమైన జోనర్
యాక్షన్ సినిమాలంటే పిచ్చి. కానీ, నిర్మాత ఇష్టపడినందు వల్ల తొలి చిత్రం ‘హమ్‌తుమ్’ చేయాల్సి వచ్చింది.
టెక్నాలజీ పరంగా...?
సాంకేతికంగా హాలీవుడ్ స్థాయికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. టార్గెట్ రీచ్ కావడానికి ఎంతో దూరం లేదనుకుంటున్నా.
ఇప్పుడన్నీ లవ్, హారర్లేగా?
డబ్బు కోసం ట్రెండ్‌కు తగిన విధంగా నిర్మాతలు సినిమా తీయటంలో తప్పులేదు. అందుకే అలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని అనుకుంటున్నా.
తొలి అవకాశం?
ఆగిపోయిన ‘హమ్‌తుమ్’ ప్రాజెక్టును ఫ్రెండ్ ద్వారా పరిచయమైన నిర్మాత శివరామిరెడ్డి నాకు అప్పగించారు. అలా దర్శకుడినయ్యా.
పరిశ్రమలో సమస్యలు?
కొత్త సినిమాతో దర్శక, నిర్మాతలకు ఎన్ని ఇబ్బందులో తెలిసొచ్చింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి థియేటర్ల వరకూ ఎన్నో సమస్యలున్నాయి. డబ్బు కోసం కాకుండా మంచి సినిమా తీసే సంప్రదాయం రావాలి.
దర్శకుడంటే?
ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కల్పించేవాడు. వారి జీవితంలో కొత్త అనుభవాన్ని మిగిల్చేవాడు.

-శేఖర్