Others

శృతిసార సంగ్రహమే శ్రీరామగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేద సారాన్నంతటినీ తనలో నిక్షిప్తం చేసుకొన్న కావ్యం శ్రీ వాల్మీకి రామాయణం. ప్రధానంగా ధర్మానికి ఆదర్శ జీవనానికి మార్గం చూపింది రామాయణ. ‘్ధరణాతీధర్మః’ అనే శాస్త్ర వచనాన్ని అనుసరించి ధర్మాన్ని ప్రవచించడమే వాల్మీకి ముఖ్య ఉద్దేశం. ధర్మాచరణమే మోక్షసాధనం. అదే రామాయణ ఉపదేశం.
ఆధ్యాత్మరామాయణ కర్త ఎవరో ఏనాటివాడో తెలియరాలేదు. అయితే బ్రహ్మండ పురాణంలో నారద బ్రహ్మ సంవాద రూపంలో ఆధ్యాత్మరామాయణం అను సంహిత ఉండడం వలన ఇది వేద వ్యాస కృతమని అభిజ్ఞుల అభిప్రాయం.
దీన్ని రచించిన కర్త గొప్ప అద్వైత తత్త్వవేత్త, మహాజ్ఞాని అనడంలో ప్రతిపత్తి ఉండదు. ఈ ఆధ్యాత్మ రామాయణంలో ప్రథాన విషయం అద్వితీయ ఆత్మ తత్త్వం. అది పవిత్రమైంది. ముక్తిని పొందడానికి తరుణోపాయం. ఉమాసదాశివుల సంవాద రూపం లో ఈ ఆధ్యాత్మ రామాయణం ఉంది. 4200 శ్లోకాలు, 64 సర్గలు, 7 కాండలు ఉన్నాయి.
ఆధ్యాత్మరామాయణంలో రాముడు ఉపనిషద్ప్రతిపాదిత అద్వితీయ స్వరూపునిగా సాక్షాత్కరింపచేయడం ఉంది. పలు సందర్భాలలో రాముడు తానే భగవంతుడని ఘంటాపదంగా ప్రకటించుకుంటాడు.
ఆత్మతత్త్వపు ప్రతిపాదనకు సుమారు 700 శ్లోకాలున్నాయి.
అరణ్యకాండ నాల్గవ సర్గలో ఆత్మను గురించి తమ్ముడు లక్ష్మణునికి చేసిన బోధ శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన గీతోపదేశాన్ని గుర్తుకు తెస్తుంది. మరలా ఉత్తర కాండ ఐదవ సర్గలో ఆత్మతత్త్వం పై తత్వ ప్రతిపాదననురాముడు చేశాడు. ‘రామగీత’ గా బహుళప్రాచుర్యం పొందింది ఇది. 62 శ్లోకాలతో ‘రామగీత సశాస్ర్తియంగా ‘తత్త్వమసి* అనుమహావాక్యానికి హేతుబద్దమైన నిర్వచనాన్ని ఇస్తుంది.
మోక్షాన్ని ప్రసాదించేది కేవలం కర్మమార్గమే నంటూ ఘంటాపదంగా చెప్పింది. భగవద్గీత వ్యాఖ్యాన కారులందరూ కర్మమార్గానికే ప్రాముఖ్యత నివ్వడం గమనించాలి. అక్కడ అర్జునుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ కర్మమార్గాన్ని బోధించినట్లు ఇక్కడ లక్ష్మణుని ద్వారా రాముడు ఆత్మ తత్త్వాన్ని సాధకులకు అందించడం ఈ కావ్యంలోని ప్రత్యేకత. సంసార బంధం నుంచి విముక్తి పొంది, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నవారికి తరుణోపాయం చెప్పమని లక్ష్మణుడు రాముడిని ప్రార్థిస్తాడు.
కరుణాసముద్రుడైన రాముడు లక్ష్మణునికి అనుగ్రహించినదే ‘‘శ్రీరామ గీత’ ఆత్మ తత్త్వాన్ని తెలియచేసే కొన్ని ఉపదేశాలు: కర్మ లననే జీవునికి పునర్జన్మ కలుగుతున్నది. జీవుడు సంసార చక్రభ్రమణంలో చిక్కుకోవడానికి అజ్ఞానమే కారణం. సాధన వల్ల అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లభిస్తుంది. అపుడు సంసార బంధం నుండి విముక్తి లభిస్తుంది. స్వర్గసౌఖ్యాలు అనుభవించి పునర్జన్మ పొందుతారు. కానీ జ్ఞానం వల్ల కలిగే ఫలం మోక్షం అంటే పునర్జన్మ ఉండదు. ఆత్మకు దేహానికి గల సంబంధాన్ని వివరిస్త పంచభూతాలతో నిర్మితమైన దేహం స్థూల శరీరం అని, మనస్సు, బుద్ధి, దశేంద్రియాలు, పంచప్రాణాలు అను పదిహేడు తత్త్వాలతో కూడిన శరీరం సూక్ష్మ శరీరం అని మాయచేయ నిర్మింపబడినది కారణ శరీరమని, లేదా వాసనాశరీరమని విశే్లషిస్తాడు. ఈ మూడు ఉపాధులలో ఉన్న ఆత్మ స్వరూపం ఒక్కటే. దీనిని తెలుసుకొని నిధి ధ్యాన మననాదుల ద్వారా సాథకుడు ఆత్మను తన హృదయంలోని నిశ్చలంగా నిలపాలని రాముడు ఉపదేశిస్తాడు.
భ్రమకారణంగా ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించడం జరుగతున్నది. అనాత్మ వస్తువును ఆత్మలా భావించడం అధ్యాస కారణంగానే సంభవిస్తున్నది. గురు సన్నిధి అధ్యయనం చేస్తూ నిధి ధ్యాస మననాదులను చేస్తుంటే ఒకనాడు ఆత్మజ్ఞానం లభిస్తుంది.
‘‘నేను ఆత్మను’’ అని ఎఱుక కలుగుతుందని అంటాడు రాముడు. అంతేకాక తనను అహర్నిశలు హృదయంలో ప్రతిష్టించుకుని ఆత్మ విచారణ సాగించే సాధకులకు అవిద్య అచిర కాలంలోనే నాశనం కాగలదని అన్నాడు. ‘‘తత్త్వమసి’’ భావనతో నిరంతరం చింతన చేస్తూ ఆత్మానందంలో మునిగిన సాధకునికి దృశ్య ప్రపంచం అదృశ్యమే అవుతుంది. సంపూర్ణ ముక్తుడౌతాడు. ఈ కనిపించేదంతా నా రూపమే. ఇది తెలుసుకొని భక్తి శ్రద్ధలతో తనను ఆరాధించే సాధకుల హృదయాలల్లో నేనెల్లపుడు కొలువై ఉంటాను ’’అని రాముడు చెప్పాడు. శ్రీరామగీతలో ఎన్నో ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి. రామగీత ను శృతి సార సంగ్రహమని విజ్ఞులు చెబుతారు.

- ఎ.సీతారామారావు 8978799884