Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గగనమ్మే సూక్ష్మమ్మై మనుజునిగా మారెననగ
ఆ వీధుల హొయలదేలి- అందముగా నడిచెననగ.

నడిచె కాంతి ప్రవాహమ్ము- రాజసమున దేలుచు
భూమియె ఒక ఆకసమ్మువోలె వెలుగు లీనెను.

శ్రీనగమో శ్రీకారమొ, శ్రీతీర్థమొ, శ్రీవత్సమొ
శ్రీముఖమున వ్రేలునట్టి శ్రీచందన సౌరభమ్మొ?

అని నట్టుల రాఘవుండు
నడిచె రాచవీధులందు.

అతనికెదురు చూచినట్లు ఆకసమ్ము వంగెను
ఆ కాళ్ళకు ప్రణమిల్లుచు అవని దారిజూపెను.

గాలి అతని ఒడలెల్లను ముద్దిడుకొని పులకరించె
అతనికి ఛత్రము బట్టుచు అంబుదమే వెనక నడిచె.

లాజలట్లు కురిసె పూలు- సేసలట్లు తుహినమ్ములు
మెరిసెపోయె మిథిలాపురి- క్రొత్త పెళ్ళికూతురటులు.

అతని నంటి నడుచునట్టి అనురాగమ్మను నట్టుల
అతని వెంటనంటి తిరుగు బంతిపూల బంతి యటుల.
అతని భుజమ్మున వ్రేలెడు భుజగరాజ రాజమనగ
నడిచి వచ్చె రామునంటి శుభలక్షణ లక్ష్మణుండు.
ఇంకావుంది...