Others

ఆయనకు ఆయనే సాటి.. పత్రికా రంగంలో ఘనాపాఠి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్భీతి, నిర్మొహమాటం ఆయన సంపాదకీయాల లక్షణాలు. తాను సత్యమని నమ్మింది ఏ భయాలకూ, ప్రలోభాలకూ లోనుకాకుండా చెప్పడం, కాలపరిమితులు లేని సాహిత్య చర్చలంటే ఆయనకు పరమ ఇష్టం. సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే కలం ఆయనది. చదువుకున్నది తక్కువే. పుస్తక పఠనం అంటే విపరీతమైన ఆసక్తి. దొరికిన పుస్తకమల్లా చదవడమే కాదు, జీర్ణించుకున్నారు. నియత విద్యవల్ల నేర్చుకున్న దానికంటే, అనియత విద్య వల్లే ఎంతో నేర్చుకున్నారు. పుస్తక విజ్ఞానమే కాదు, ప్రపంచాన్ని చూసి, ఎంతో నేర్చుకున్నారు. ఆయన లౌకికతను, రాజకీయాన్ని, సృజనాత్మకతను, రచనలను సమంగా పండించిన సవ్యసాచి. అనేక భూషణ దూషణాదులకు గురై ఒడిదుడుకుల జీవిత పరిణామం చిత్రమైంది. ఆయన పేరే గోరాశాస్ర్తీ. ఆయనే గోవిందు రామశాస్ర్తీ. ఇవాళ ఆయన శత జయంతి సదస్సు. ఆయనను విభిన్న కోణాలలో దర్శించిన పాత్రికేయ ప్రముఖులు తమ ప్రసంగ పత్రాలలో ఆయనను స్మరించుకుంటున్నారు. ఆయన ప్రతిభను కీర్తించనున్నారు.
ప్రముఖ జర్నలిస్టు, సంపాదకుడు, సాహితీవేత్త ఖాసా సుబ్బారావు వద్ద తెలుగు స్వతంత్రలో జర్నలిజం ప్రారంభించి, తర్వాత ఆ స్వతంత్ర పత్రికకు సంపాదకులయ్యారు. ఒక దశాబ్దంపాటు ప్రతిభ, సృజనాత్మక శక్తిని, ఇతరేతర శక్తులను ప్రదర్శించడానికి గోరాశాస్ర్తీకి ఓ ప్రక్క ఆకాశవాణి, ఇంకో విధంగా ‘స్వతంత్ర’ చక్కని అవకాశాన్ని కల్పించాయి. గోరాశాస్ర్తీ చేత పుంఖానుపుంఖాలుగా శ్రవ్య నాటికలు రాయించటానికి నాంది పలికిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆ కృషి కొనసాగించిన వారు జనమంచి రామకృష్ణ.
ఆ తర్వాత 1961 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు రెండు దశాబ్దాలపాటు, 1982లో మరణం వరకు ఆయన సంపాదకులుగా పనిచేశారు. నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి.. సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే గోరాశాస్ర్తీ సంపాదకీయాలంటే ఆ రోజులలో పాఠకులు చెవి కోసుకునేవారు. చెప్పదల్చిన విషయాన్ని సూటిగా నొప్పించక తానొవ్వక, మెత్తని చురకలేస్తూ ఆలోచింపచేసే విధానమే వ్యంగ్యం. సునిశిత హాస్యం అపహాస్యం కాకుండా వ్యంగ్యార్థం వచ్చేలా రచన చేయడమే దీని పరమార్థం. కవిత అయినా, కథ అయినా, వ్యంగ్య రచన అయనా త్వరగా పాఠకులకి చేరవేయడమే. అందులో గోరాశాస్ర్తీగారిది అందె వేసిన చెయ్యి.
జర్నలిజంలో ఓనమాలు కూడా నేర్వని మనిషి ప్రవృత్తికి సరైన వృత్తి లభించాక పత్రికా రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నారు. ఆయనను ఏ ఇజాలూ కట్టిపడేయలేదు. ఇజాల పట్ల ద్వేషభావమూ లేదు. ఆనాడు ఆయన రేడియో నాటికలకు ఒరవడి దిద్ది తెలుగు శ్రవ్య నాటికను సుసంపన్నం చేశారు. స్టీవెన్ స్పెండర్ ఆంగ్ల కవిత్వం పట్ల గోరాశాస్ర్తీకి ప్రత్యేక మోజు ఉండేది. గోరాశాస్ర్తీ సంపాదకీయాలలో కొన్ని, ఆయన నాటికలు, కథలు ఈతరం వారికి అందవలసిన అవసరం ఉందన్న లక్ష్యంతోనే ఆయనను స్మరించుకుంటూ ఆయన కలం నుంచీ జాలువారిన కొన్ని ముఖ్య రచనలకు పుస్తక రూపం ఇవ్వాలని వయోధిక పాత్రికేయ సంఘం యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకుంది.

నందిరాజు రాధాకృష్ణ 98481 28215