Others

బహుముఖ ప్రజ్ఞాశాలి (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి షా నాటకం ప్రదర్శిస్తూంటే వెనుకనుంచి ఎవరో నాటకం బాగోలేదని కేకలు పెట్టారట. ఆ సమయంలో హాల్లో వున్న షా మహాశయుడు కేకపెట్టిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘‘నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ నాటకం బాగోలేదు. కానీ ఇన్ని వేలమంది ఈ నాటకం బాగుందని ఎంతో ముచ్చటపడి చూస్తుంటే మనిద్దరం ఏం చేయగలం, ప్చ్’’ అన్నాడుట. శాస్ర్తీగారి సంపాదకీయాలు సుదీర్ఘంగా వుంటాయని కొందరంటారు. ‘అదేమిటి? ఆ సంపాదకీయంలో ఆయన అన్ని అంశాలూ చర్చిస్తారేమిటి? లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే మూడు పేరాల
సంపాదకీయాలు రాయడం’ అని మరి
కొందరు మేధావులంటారు. అయితే ‘ఆంధ్రభూమి’లో గోరాగారి సంపాదకీయాలు చదివేవాళ్ళు మాత్రం ఈ విధంగా ఆలోచించరు.

‘‘నేటి యువకులకు ముగ్గురు రచయితలంటే ఎంతో ఇష్టం’’ అన్నాడు మిత్రుడు కుందుర్తి 1958లో ఓ రోజున. ‘ఎవరు ఈ రచయితలు’ అని నేను ప్రశ్నించగా, ఆయన చెప్పిన సమాధానం: ‘‘గోపీచందు, బుచ్చిబాబు, గోరాశాస్ర్తీ’’ అని. దురదృష్టవశాత్తూ మొదటి ఇద్దరూ మన మధ్య లేదు. అదృష్టవశాత్తూ శ్రీ గోరాశాస్ర్తీ ఆంధ్రాంగ్లముల మేస్ర్తీయై సవ్యసాచియై అశేష పాఠకోత్తములను ఈనాటికీ అలరిస్తూ వెలుగొందుతున్నారు.
గోరాశాస్ర్తీగారి సంపాదకీయాలమీద కొందరు చేసిన వ్యాఖ్యలు విన్నాక నాకు బెర్నార్డ్ షా గుర్తుకొచ్చాడు. ఒకసారి షా నాటకం ప్రదర్శిస్తూంటే వెనుకనుంచి ఎవరో నాటకం బాగోలేదని కేకలు పెట్టారట. ఆ సమయంలో హాల్లో వున్న షా మహాశయుడు కేకపెట్టిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘‘నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ నాటకం బాగోలేదు. కానీ ఇన్ని వేలమంది ఈ నాటకం బాగుందని ఎంతో ముచ్చటపడి చూస్తుంటే మనిద్దరం ఏం చేయగలం, ప్చ్’’ అన్నాడుట. శాస్ర్తీగారి సంపాదకీయాలు సుదీర్ఘంగా వుంటాయని కొందరంటారు. ‘అదేమిటి? ఆ సంపాదకీయంలో ఆయన అన్ని అంశాలూ చర్చిస్తారేమిటి? లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే మూడు పేరాల సంపాదకీయాలు రాయడం’ అని మరికొందరు మేధావులంటారు. అయితే ‘ఆంధ్రభూమి’లో గోరాగారి సంపాదకీయాలు చదివేవాళ్ళు మాత్రం ఈ విధంగా ఆలోచించరు. వాళ్ళకు సంపాదకీయాలు అలా వుంటేనే తృప్తి. ఒకవేళ సంపాదకీయం పొట్టిగా వుంటే, అన్ని విషయాలూ స్పృశించకుండా వుంటే అది గోరాగారు రాయలేదేమోనని కూడా వాళ్ళకు సందేహం. తెలంగాణలో ఉదయం ‘చాయ్’తో ఆ సంపాదకీయాలు కనీసం పదివేలమంది అయినా చదువుతారని అంచనా.
అవి సంపాదకీయాలు కావు. అవి చదువుతూ వుంటే సంపాదకుడు పాఠకులతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్తున్నట్లుగా మనం ఫీలవుతాము. అలాగని కేవలం ఒక కేటలాగువలె సంపాదకీయం ఉంటుందనుకుంటే అది పొరపాటు. ప్రతి సంపాదకీయంలో బోల్డంత వ్యంగ్యం, సునిశితమైన పరిశీలన అతి సూక్ష్మమైన తర్కం అన్నీ ఉంటాయి.
గోరాశాస్ర్తీగారిని నేను సుమారు నలభైఏళ్ళుగా ఎరుగుదును. ఆయనలో కొట్టొచ్చే గుణం నిర్భీతి. అందువల్లనే ఆయన చెప్పదలచుకున్నది సూటిగా పులుముడు లేకుండా చెప్పగలగడం.
నా బాల్యంలో తొలి టీన్స్‌లో ఆయన ప్రతి రచననూ ఎన్నోసార్లు చదివేవాణ్ణి. అవి చదువుతూంటే నా మెదడు పంచ రంగుల కలల గూడు అయ్యేది. ఆయన అక్షరాలకు ఒక పరిమళం వున్నట్లుగా నాకు తోచేది.
నాకు బాగా జ్ఞాపకమున్న శాస్ర్తీగారి తొలి రచన పద్యాల్లో ‘సున్నా అరసున్నా’ ఒకటి. ఆ రోజుల్లోనే ఆయన రాసిన ఒక మంచి కథ ‘హూపీ’. ఒక ఇంగ్లీషు దొరగారూ, ఆయన పెంపుడు కుక్కా వీటి చుట్టూ కథ నడుస్తుంది. జీవితంలో అన్నీ పోగొట్టుకున్న ఆ అభాగ్యుడు కుక్క కూడా చనిపోతే ఎంతో చలించిపోతాడు. కుక్కకి సమాధి కట్టి రాత్రిళ్ళు అక్కడే గడుపుతాడు. హృదయాన్ని కదిలించే కథ ఇది.
ఇంచుమించు ఈ రోజుల్లో (1937-40) తెలుగు సినిమా పత్రికకు తారలతో ఇంటర్వ్యూలు గోరా రాయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలు ఎంతో బరువుగా వుండేవి. సినిమా పత్రికల్లో సాధారణంగా కన్పించే చచ్చు సమీక్షలవలె కాక రచయిత ఉన్నతమైన ‘ప్లేన్’లోకి వెళ్లి ఉదాత్తమైన భాషలో రచన సాగించేవాడు. సాధనా బోస్, కుమారి, మాలతి వీళ్లను ఇంటర్వ్యూ చేసి ఆయన వ్రాసిన వ్యాసాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
గోరాకు ఆ రోజుల్లో అన్ని పత్రికల్లో మిత్రులుండేవారు. రాజమండ్రి ‘దీపిక’, ఏలూరు ‘కథావీథి’, శ్రీశ్రీ ‘టాంటాం’- వీటన్నింటితో ఆయనకు సన్నిహితమైన పరిచయం వుండేది. గోరాకు అత్యంత ప్రియమైన మిత్రుల్లో కీ.శే.మహంకాళి శ్రీరామమూర్తిగారు ఒకరు. వీరిద్దరూ భద్రాచలం హైస్కూల్లో క్లాస్‌మేట్స్. ‘ఆనందవాణి’ పత్రిక మదరాసునుండి శ్రీ మహంకాళి శ్రీరామమూర్తి సంపాదకత్వంలో వస్తున్నపుడు గోరా అందులో ‘వినాయకుడి వీణ’ అనే కాలం ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులవి.
1937 నుంచి 1946 వరకు వివిధ పత్రికల్లో గోరా రచనలు వస్తూ వుండేవి. ఆ రోజుల్లో ఆయన కలం పేర్లు కూడా అప్పుడప్పుడూ ఉపయోగించేవారు. అందులో ‘జహంగీర్’ ఒకటి. గల్పికలు కూడా తరచు రాసేవారు.
అప్పటికే ఆయన కొంతకాలం నేవీలోనూ రైల్వేలోనూ ఉద్యోగం చేశారు. 1946లో శ్రీ ఖాసా సుబ్బారావు గారు ‘స్వతంత్ర’ ప్రారంభించినపుడు పాతవాళ్ళను వదిలేసి ప్రతిభ వున్న యువకులకు అవకాశం కల్పించాలనుకున్నారు. మదరాసు పత్రికా రంగంలో గోరా పేరు వినిపించింది. రైల్వే ఉద్యోగం విడిచిపెట్టి ఇంగ్లీషు స్వతంత్రలో శ్రీ గోరాశాస్ర్తీ ప్రవేశించారు. అయితే ఆయన రైల్వే అనుభవాలు వృథా పోలేదు. రెండు మూడు రేడియో నాటికలకూ ‘బాస్కెట్ ఆఫ్ ఆరంజెస్’ అని ఆయన ఆంగ్లంలో రాసిన కథానికకూ ముడిసరుకు రైల్వే ఉద్యోగానికి సంబంధించినదే.
ఇంగ్లీషు స్వతంత్రకు సోదర వారపత్రికగా తెలుగు స్వతంత్ర 1948లో స్థాపించినపుడు తెలుగు స్వతంత్ర పని గోరా వెడల్పయిన భుజాలపైన పడింది. ఒకరకంగా తెలుగు పత్రికా ప్రపంచంలో అదొక స్వర్ణఘట్టం. నిశితమైన సంపాదకీయ వ్యాఖ్యలతో చక్కని వ్యంగ్య రచనలతో తెలుగు స్వతంత్ర వారం వారం వచ్చేది. అనతికాలంలోనే తెలుగు స్వతంత్ర తెలుగువారికి ప్రియమైన పత్రిక అయింది. ఇవాళ బాగా కొమ్ములు మొలిచిన మేటి రచయితలు చాలామంది తొలిసారిగా స్వతంత్ర పుటల్లో ఉదయించారు. సర్వశ్రీ చలం, శ్రీశ్రీ, హరీన్, నండూరి సుబ్బారావు, కొడవటిగంటి కుటుంబరావు వంటి సుప్రసిద్ధులే కాక అనేకమంది యువ రచయితలు ‘స్వతంత్ర’లో వారం వారం కనిపించేవారు. రచయితల4
తో రెగ్యులర్‌గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు శ్రీ గోరా. దీన్ని గురించి రాస్తూ ఒకచోట చలం అంటాడు- ‘‘కవిత్వాలు కోట్ చేసి నేను రాయకపోతే బలవంతం చేసి రాయించే సూనృతులైన శాస్ర్తీగారు’’ అని. ఒక తరాన్ని తెలుగు స్వతంత్ర ప్రభావితం చేసిదంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు.
ఆ రోజుల్లోనే గోరా రేడియో నాటికలు కూడా పుంఖాను పుంఖంగా వచ్చాయి. రావణుని గూర్చి ఒక సరికొత్త దృక్పథంతో ఆయన వ్రాసిన నాటిక చిరకాలం శ్రోతల మనస్సుల్లో మెదిలే గుణం కలది. ‘ఆశ ఖరీదు అణా’ మరో మంచి నాటిక శ్రీ గోరాశాస్ర్తీ రేడియో నాటికలు చదివితే ఆయన ఆంధ్రా యుజీన్ ఓనేన్ మల్లే కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాల్లోని మూగబాధకు ఒక రూపకల్పన ఈ నాటికలు. మానసిక వ్యధతో కృంగుతున్న వ్యక్తుల జీవితాలకు ఎక్స్‌రేలు ఇవి.
మద్రాసు విడిచిపెట్టాక హైదరాబాదు నుండి శ్రీ గోరా ‘స్వతంత్ర’ కొంతకాలం నడిపారు. గత పద్దెనిమిదేళ్లుగా ‘ఆంధ్రభూమి’ దినపత్రిక సంపాదకులుగా వున్నారు.
గోరాది మొదటినుండీ తీవ్రమైన బాణీ, వాక్కు కూడా తీవ్రమైనదే. ఆయన ఆంగ్లంలో కూడా ప్రతిభావంతుడయిన రచయిత. గత కొలది సంవత్సరాలుగా హైదరాబాదులోని ఒక ఆంగ్ల దినపత్రికలో ఆయన రాస్తున్న సంపాదకీయాలు రసజ్ఞుల మెప్పునూ సామాన్యుల ప్రశంసనూ చూరగొన్నాయి. మొన్న జె.పి. మరణించినపుడు ఆయన రాసిన సంపాదకీయం భారత దినపత్రికల్లో వెలువడిన రెండు మూడు ఉత్తమ సంపాదకీయాల్లో ఒకటని విజ్ఞులు అన్నపుడు ఏ తెలుగు గుండెలో ఆనందం స్పందించదు?

- గోపాల చక్రవర్తి