AADIVAVRAM - Others

కూడలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహల రెక్కలు తొడిగి
చిననాటి నా వూరి దిగుడుబావిని
వెతుక్కొంటూ వెళ్లిపోతాను
దిగుడు బావి కనిపించదు.
మా వూరి ప్రెసిడెంటుగారి హృదయమంత విశాలం
ఆయన నవలాకుల తోట కోసం
వొళ్లంతా కళ్లు చేసుకుంటాను
నవలాకులతోట కనిపించదు
మా వూరి రచ్చబండ చప్టా మధ్యలో
పెద్దమనిషి తరహాలో నీడనిచ్చిన చింతచెట్టు
నలుగురికీ ముప్పొద్దుల గాలికొసరిన మహావృక్షం
నిశ్శబ్దంగా ఎందరెందరి కథలో వింటూ
ఏటేటా ఎదుగుతున్నా వొదిగినట్టే వుండేది
అసలు చప్టానే లేదక్కడ.
చింత చెట్టు ఎక్కడుంటుంది?
మా వూళ్లో కాశీ అన్నపూర్ణ కన్నవారి కాంతమ్మ
ఎండన పడి వస్తే దాహానికి మజ్జిగనిచ్చి
ఆకలిని మాయం చేసే మమతల ముద్దలు పెట్టే ఇల్లు
ఇల్లెక్కడుందని ఇప్పుడు
పగలే నక్షత్రాలు మెరిసిపోతుంటేనూ
నా చిన్నప్పటి వూరుకోసం
వీధి చివర నిలబడి చూపులు సారిస్తాను
కళ్లు వెతికినంత మేర గాలిస్తాను
కాళ్లు అలిసినంత మేర నడుస్తాను
మా వూరు కనిపించదు
మా వూరి పొలిమేర కనిపించదు
మా వూరి పేరు కోసం వేల కళ్లైపోతాను
మా వూరు పేరు కోల్పోయింది.
నా రెక్కలు మాయమై పోతాయి
మా వూళ్లోనే వున్నానే్నను
ఇప్పుడది నగరంలోని ప్రధాన కూడలి!

-గుర్రాల రమణయ్య 99639 21943