AADIVAVRAM - Others

100% లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియా నిను చూడలేక.. ఊహలో నీ రూపు రాక.. నీ తలపులోనే నే బ్రతుకుతున్నా.. ప్రేమలో... వాన చినుకై.. పూవుల మొలకై.. విరిసిన చెంపల మెరిసిన కెంపై.. చూపరులకు కడు ఇంపై సొంపైన పూలతాంగికై...
ఆమె ఊహల్లో నితిష్ స్నేహితుడు వేణుమాధవ్‌తో బుల్లెట్ మీద జగదాంబ సెంటర్ వైపు వెళ్తూ సిగ్నల్ పడటంతో ఆగిపోయారు. అలా ఎంతసేపు అయిందో ఏమో తెలియదు కానీ నితిష్ చూపు మాత్రం తమ ముందాగిన ఓ బ్యూటీ మీద నిలిచింది. ఎంతకీ తను మొహం తమకగుపించని వైపు చూస్తూ వెతికే తన కళ్లని తిప్పలు పెడ్తోంది.
తన సహనానికి కూడా ఓ హద్దుంటుంది. సహనం సంయమనం పాటిస్తూ తను తనని చూసే ప్రయత్నాన్ని మాత్రం సడలించలేదు. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ క్లియరవడం బ్యూటీ స్కూటీ ముందుకు సాగడం.. నితిష్ తనని వెంబడించడం అంతే వేగంగా జరిగింది. తను తన కంటిచూపునకు అందుతోంది.. చూపుకన్నా స్పీడ్‌గా తనని వెంబడించాడు. బ్యూటీని మాత్రం అధిగమించలేక పోయాడు. కానీ స్కూటీ నంబర్ ప్లేట్‌ని మాత్రం సెల్‌ఫోన్‌లోకి ఎక్కించాడు క్లిక్‌మనిపించి.
వేణుమాధవ్‌కి ఇదంతా వింతగా అనిపించింది. మునుపెన్నడూ నితీష్‌లో ఈ రొమాంటిక్ ఈవెంట్ చూడలేదు తను. బహుశా ఇది నితిష్ మెగా లవ్ సీరియల్‌కి తొలి ఎపిసోడ్ కావొచ్చు.
తనలో తను నవ్వుకున్నాడు వేణుమాధవ్ వెనక కూర్చుని. నితిష్ మది మదనంలో ఆ కనె్నగులాబీ గురించిన ముఖ కవళికలు గుములు గుములుగా ముసురుతున్నయ్. ఆశల రెక్కలు విచ్చుకుంటున్నాయ్.. విచ్చుకత్తుల్లా గుండెకు గుచ్చుకుంటున్నాయ్. తనకై వేట మొదలైంది.. ఉమెన్స్ కాలేజీలు, హాస్టల్స్, బీచ్‌రోడ్డు, షాపింగ్ మాల్స్, సినీ స్క్రీన్స్, మల్టిప్లెక్స్‌లు.. ఒకటేమిటో అన్ని చోట్లా గాలించేస్తున్నాడు. వైజాగ్ మెయిన్ సెంటర్సంతా కల్లతో చెరిగేస్తున్నాడు. తెగ తిరిగేస్తున్నాడు పిచ్చివాడిలా, ప్రేమ బిచ్చగాడిలా.
తనకు పరిచయమైన సినీ స్టార్స్ ముఖాలతో ఆ అందాల రాశిని, అపరంజి బొమ్మని పోల్చుకుందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎక్కడా మ్యాచ్ అవట్లేదు. ముఖమైన చూపని మెరుపు తీగని పోల్చుకోవడం ఎలా? ఎలా??
ఏమైనా సరే స్కూటీ నంబర్ పట్టుకుతీరాలి. చేతికందని పట్టుపూల రెమ్మని దక్కించుకోవాలి. కైలాసగిరి వైపు వెళ్తున్నాడు నితిష్ వేణుమాధవ్‌ని కలవడాని. యధాలాపంగా కైలాసగిరి పార్కింగ్‌కేసి చూశాడు.
అదే స్కూటీ.. అదే కలర్.. అదే నంబర్.. వేగంగా వెళ్తున్న బుల్లెట్ సడన్‌గా ఆగింది. అంతే వేగంతో నితిష్ స్కూటీని సమీపించాడు.
ప్రేమలో తను తినుకై.. వాన చినుకై.. పూల మొలకై.. విరిసిన చెంపల మెరిసిన కెంపై.. చూపరులకు కడు ఇంపై సొంపైన పూ లతాంగికై..
అలా భావనా వీధుల విహరించే ప్రేమ విహారి ఈ కైలాసగిరి పార్కింగ్ ప్రాంతాలకి రావడం.. పార్కింగ్ అంతా కలియ వెతకడం.. అంతా వెంటవెంటనే జరిగినప్పటికీ స్కూటీ అక్కడ లేదు. సారీ.. సారీ.. ఈసారి మిస్ కొట్టింది బ్యూటీ.. నా అంత దురదృష్టవంతుడు ఇంకెవరు ఉండరుగాక ఉండరు.. అంతలో ఏదో మెరుపులా మెరిసింది. ఏం పర్వాలేదు, వైజాగ్ సిటీలోనేగా తను ఉంటా. ముచ్చటగా మూడవసారి పట్టుకుంటా ముత్యాల ముద్దుగుమ్మని.. పట్టుకొమ్మని అనుకుంటూ వేణు కోసం బుల్లెట్‌ని ముందుకురికించాడు.
‘నితిష్..’ అమ్మ కేకేసింది. ఎటో దిగాలుగా చూస్తున్న నితిష్ ఉలిక్కిపడినట్లయి అమ్మవైపు చూశాడు ప్రశ్నార్థకంగా. అంతా గమనిస్తున్న అమ్మ ‘రేపు మనం ఒకచోటికి వెళ్తున్నాం..’ అంది. యాంత్రికంగా తల ఊపాడు నితిష్ - ఎక్కడికో, ఎందుకో కూడా అడగాలని అనిపించలేదు నితిష్‌కి. అయినా అమ్మే చెప్పింది ‘నీ పెళ్లిచూపులు...’ అని.
‘పెళ్లిచూపులేమిటమ్మా సడన్‌గా..’ నీళ్లు నములుతున్నాడు నితిష్.
‘చూసినంత మాత్రానే పెళ్లైపోదులే...’ అంటూ నాన్నగారు ‘నీకు నచ్చితేనేరా..’ అంటూ అమ్మ అనునయించి కారెక్కించారు అమ్మానాన్న.
నా మనసులో తన గురించిన ఆలోచనల్లా చాలా నెమ్మదిగా నడుపుతున్నాడు కారు డ్రైవర్. తీరా విండోలోంచి చూద్దును గదా ఇసుక వేస్తే రాలనంత జనం.. ఆ పక్క ఈ పక్క సగం రోడ్డుకి వాహనాలు.. కారణం హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌తో నగల దుకాణం గ్రాండ్ స్కేల్‌లో ఓపెనింగట. జనం తండోపతండాలుగా ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్‌ని చూడ్డానికి.
నితిష్‌కి చాలా అసహనంగా ఉంది. ఆ జనాన్ని.. తన గురించి తనలో జరుగుతున్న అంతర్మథనాన్ని.. భరించలేక. ఇక తను జీవితంలో తారసపడదా? తన ప్రేమ తెల్లకాగితమేనా? రంగులేవీ కనపడవా? ఎడారి ప్రయాణమేనా? నిరాశ నిశీధి చుట్టాలేనా? ఇలా లోలో సాగే ఊహలతో నితిష్‌కి కారులో ఏసి. పని చేయని ఫీలింగ్.. మొహమంతా చెమటతో తడిసిపోయి, కారు చాలా ఇరుకైనట్లు, చాలాచాలా అసౌకర్యంగా అనిపించింది నితిష్‌కి.
పెళ్లికూతురు వాళ్లిల్లు రానే వచ్చేసింది. పెళ్లివారు మమ్మల్ని సాదరంగా లోనికి ఆహ్వానించారు.
పెను చీకటాయే లోకం.. చెలరేగే నాలో శోకం.. విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె.. ఎక్కడ నుంచో వినవస్తోంది శ్రీశ్రీ గీతం... నాలో చెలరేగే తనపై ఆలోచనలకి తగ్గట్టుగా. ఆ భావనలకి తెర దించుతూ, ఆ కాంపౌండ్‌లో నా బ్యూటీ స్కూటీ సాక్షాత్కరించింది. నా కళ్లలో వెలుగు ఆవరించుకుంది. మళ్లీ హోప్ మొదలయ్యింది.. కళ్లకి అనే్వషణ స్టార్ట్ అయ్యింది. మనసిప్పుడు స్మార్టయ్యింది.
రెండు పక్షాల వైపు నుంచి మాటలు, పలకరింపులు పరిచయాలు మొదలయ్యాయి. టీలు, కాఫీలు, కూల్‌డ్రింక్స్, స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు. ఇవేవీ పట్టీపట్టనట్లు నితిష్ మూలమూలలకి వెతుకుతున్నాడు తన స్వప్న సుందరి కోసం, స్వర్ణమంజరి కోసం.. హాలంతా ఎప్పటికప్పుడు కలియ వెతికేస్తున్నాడు నితిష్. వైజాగ్ సిటీనే గాలించిన ఆ కళ్లకి ఈ ఇల్లు వెతకడం ఓ లెఖ్ఖా-
నా అసహనాన్ని గమనించిన పిల్ల తల్లి, తండ్రి ‘బాబూ.. మీకు ప్రైవసీ కావాలంటే..’ అంటూ మెట్లవైపు చూపించాడు కళ్లతోనే. ఆ మాట పూర్తి కాకుండానే నితిష్ ఒక్క ఉదుటున లేచి నిల్చున్నాడు. తను దారి తీసింది మెట్లపైన ఉన్న తన గది వైపు. భువి నుంచి దివికి దారితీస్తున్న తననే అనుసరించాడు నితిష్.
గదిలో సెటిలయిన వెంటనే నితిష్ తన సెల్‌లో భద్రపరచిన స్కూటీ నంబర్ దానిని నడుపుతున్న తనని చూపించి ఈ స్కూటీ మీదేనా.. బయట పార్కింగ్‌లో చూశాను..’ అంటూ తన కళ్లల్లో జవాబుని వెతికే ప్రయత్నం చేస్తూ. తను తల అడ్డంగా తిప్పుతూ ‘మా చెల్లిది..’ అంది కళ్లని అదోలా ఏమార్చుతూ. అంతే నితిష్ కిందికి వెళ్దామా అంటూ మరో మాటకి తావివ్వకుండా కదిలాడు. ‘ఏం బాబూ.. అప్పుడే మీ ఇద్దరి పరిచయాలు...’ అంటూంటే పిల్ల తండ్రి మధ్యలోనే అడ్డుకుంటూ నితిష్ ‘మీ రెండో అమ్మాయిని పిలిపించండి ప్లీజ్..’ అన్నాడు.
అక్కడున్న వాళ్లెవరికీ అర్థం కాలేదు. ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. కూతురు యామిని మాత్రం తండ్రికి సైగ చేసింది నవ్వుతూ.
‘ఓహో.. ఇది యామిని పనా.. మీ ఇద్దరి ప్రైవసీలో నుంచి నాకింకో కూతురు పుట్టుకొచ్చిందా.. చూడు బాబూ.. నాకున్నది ఒక్కతే కూతురు. ఇంకే కూతురు లేదం’టుంటే చిలిపిదనం పరవళ్లలో ఊయలూగుతున్న యామిని వైపు చూస్తూండిపోయాడు నితిష్ టెన్షన్ ఫ్రీగా.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505