AADIVAVRAM - Others

విజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిన్సిపాల్ చేస్తున్న అన్ని పనులలో ఉపాధ్యాయులలో వృత్తిపరమైన లక్ష్యాన్ని కలిగించటం చాలా కష్టతరమైన పని. ఉపాధ్యాయ బృందంలో ప్రిన్సిపాల్‌కన్నా ఎక్కువ అనుభవం కలవారు కూడా ఉంటారు. తనకన్నా ఎక్కువ అంకిత స్వభావం కల ఉపాధ్యాయులు ఉంటారు. కొత్తవారు కూడా ఉంటారు. ఉపాధ్యాయులలో మిషనరీలు కలిగించేది మీటింగ్‌ల వల్ల వచ్చేది కాదు, వ్యక్తిగతంగా మాట్లాడటం, కొత్తవారైతే తను చేసి చూపించటం, అనుభవం కలవారైతే చర్చించటం, సలహాలు ఇవ్వటమే కాదు తీసుకోవటం జరగాలి. ఈ పనులన్నీ ప్రిన్సిపాల్ తన పనితో నేర్పవలసిందే కానీ ప్రవచనాలతో వచ్చేది కాదు. కొన్నిసార్లు ప్రత్యామ్నాయ మార్గం చూపించేటప్పుడు ఈ విధంగా కూడా ఆలోచించవచ్చునన వచ్చును కానీ ఈ విధంగానే చేయాలని ఆదేశించకూడదు. ప్రిన్సిపాల్‌కు ఆఫీసులోకన్నా వ్యక్తిగతంగా కలవటం, స్ట్ఫారూమ్‌లో కొంతకాలం గడపటం, తరగతి గదిలో కొంతకాలం గడపటం, తన నిత్య కార్యక్రమంలో ఒక భాగంగా భావించాలి. స్కూలు టైంలో మాత్రం ఆఫీసులో కన్నా టీచింగ్‌లోనే గడపటం మంచిది. కొంతమంది ఉపాధ్యాయులు కొత్త పద్ధతులను ఆవిష్కరించవచ్చును. వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి. సదుపాయాలు కలిగించాలి. అవసరమనుకున్నప్పుడు కొన్ని సెమినార్లకు స్కూలు ఖర్చుపైన పంపిస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులలో వృత్తిపరమైన అంకితభావం కలిగించటం కచ్చితంగా ఇదే పద్ధతియని చెప్పలేం.
* * *
నా జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసిన మనిషి అసోదొద్దీన్. అతను మలక్‌పేట నుంచి సికిందరాబాద్ హైస్కూల్‌కు వచ్చేవాడు. స్కూలు 10 గంటలకు ఆరంభమయ్యేది కానీ అసోదొద్దీన్ మాత్రం పిరమిడ్ గ్రౌండ్‌లో వున్న ప్రభుత్వ స్కూలుకు 9 గంటలకే వచ్చేవాడు. ఆఫీస్ క్లర్క్‌ను కూడా ఉదయం 8 గంటలకే రమ్మనేవాడు. ప్రభుత్వంలో చేయవలసిన కరస్పాండెన్స్‌ను 9 గంటలకు సిద్ధం చేయమనేవాడు. 9.45 నిమిషాల వరకు ఆఫీసు పని పూర్తి చేసుకునేవాడు. 10 గంటలకు నిమిషాలకు ముందే గేటు దగ్గరకు వచ్చి నిల్చునేవాడు. వచ్చే ప్రతి విద్యార్థికి తను నమస్కారం చెప్పటమో, తను ప్రతి నమస్కారం చేయటమో జరిగేది. అది కాగానే మార్నింగ్ అసెంబ్లీకొచ్చి నిలుచునేవాడు. తన విజన్‌ను తన అనుభవాలతో జోడించి 5 నిమిషాలు మాట్లాడేవాడు. తర్వాత మరలా గేటు దగ్గరకు వెళ్లి లేట్‌కమర్స్ ఎవరని చూసేవాడు. వారిని మందలించి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్‌ను పర్యవేక్షిస్తూనే ఉండేవాడు. తాను చదువు చెప్పటమో లేక ఇతర ఉపాధ్యాయులు తరగతిలో బోధిస్తుంటే పరిశీలించటమో లేదా ఉపాధ్యాయులతో సంప్రదించటమో లేక పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడటమో ఈ విధంగా తన సమయమంతా కూడా బోధనా కార్యక్రమానికే వినియోగించేవాడు. ఒక స్కూలు ప్రమాణాలు పెంచుకోవాలంటే ప్రిన్సిపాల్ ఎంత సమయం ఇలాంటి కార్యక్రమాలపై వినియోగిస్తాడో అదే నిర్థారణ చేస్తుంది. సాయంత్రం 4 గంటలకు కాగానే క్రీడా స్థలానికి వెళ్లేవాడు. ఎవరు ఏ ఆట ఆడుతున్నారు? టీచర్లు వస్తున్నారా? లేదా? ఆటలు క్రమంగా జరుగుతున్నాయా? లేదా? చూసేవాడు. అప్పటికి అసోదొద్దీన్ వయసు 55 సం.లుండేది. అప్పటికే ఆయన ఇంగ్లండ్‌లో 10 సం.లు హెడ్‌మాస్టర్‌గా పని చేసి వచ్చడు. సాయంత్రం 6 గంటలకు సికిందరాబాద్ లోకల్ ట్రైన్స్‌లో మలక్‌పేట వెళ్లేవాడు. నేను అతనితో కలిసి ప్రయాణం చేస్తుంటే చాలా విషయాలు చెప్పేవాడు. స్టేషన్‌లో కూర్చున్నప్పుడు చెప్పేవాడు. ఒకనాడు చెప్పులు పాలిష్ చేస్తానని ఒక పిల్లవాడు నన్ను ప్రాధేయ పడుతున్నాడు. నాకు అవసరం లేదయ్యా అని ఆ పిల్లవాడితో అన్నాను. నీకు అవసరం లేకపోతే ఆ పిల్లవానికి అవసరముందని అసోదొద్దీన్ అన్నాడు. ఆయన మానవత్వానికి సలాం చేశాను. ఇలా అసోదొద్దీన్ ప్రతి నిత్యం ఆయన చేస్తున్న పనులు నాపై ఎంతో ముద్ర వేశాయి.
ఒక స్కూలు ప్రమాణాలు పరీక్షించటానికై ప్రిన్సిపాల్ దినచర్య చూస్తే తెలిసిపోతుంది. అదే గీటురాయి. స్కూల్‌పైన, సమాజంపైన ప్రిన్సిపాల్ ఎలాంటి దృక్పథాన్ని వ్యక్తం చేస్తాడో అదే గీటురాయి. ప్రిన్సిపాల్ పని ఒక ఉద్యోగం కాదు. అది ఇంజనీర్ పని కాదు. సమాజం నిర్మాణం చేసేవాడే హెడ్‌మాస్టర్ అని అర్థమైంది. నా జీవితాంతం హెడ్‌మాస్టర్ అసోదొద్దీన్ అడుగుల్లోనే నడిచే ప్రయత్నం చేశాను. ఆయన జీవితమే నాకు విలువ.
* * *
ఈనాడు ఉపాధ్యాయుడు రెండు శిఖరాల మధ్య నిల్చున్నాడు. ఒకవైపున గ్లోబల్ కాంపిటీషన్, రెండోవైపున స్థానిక ఒత్తిడి. ఈ రెంటి మధ్యన ఉపాధ్యాయుడు నిల్చున్నాడు. ఈ రెండింటిని కలుపవలసిన బాధ్యత ఉపాధ్యాయునిది. ఉపాధ్యాయుని కాళ్లు స్థానికంలో ఉండాలి. చూపు గ్లోబల్ వైపు ఉండాలి. ఇవాళ స్థానిక సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉండాలి. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన వర్ణాలు పాఠశాల ద్వారానే తమ విముక్తిని కోరుతున్నాయి. రెండోవైపు టెక్నాలజీ ఊహించనంత పెరిగిపోతున్నది. దేశం సంపదే టెక్నాలజీపై ఆధారపడి ఉండటం వలన ప్రతి దేశం కూడా తమ టెక్నాలజీ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాయి. పేదరికంతో అలమటిస్తున్న మనిషిని శిఖరాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని మరువరాదు. స్థానికతకు గ్లోబలైజేషన్‌కు సంధానకర్త టీచర్. ఆర్థిక రంగం క్షీణించటంతో దానిపై ఆధారపడిన వ్యవస్థలు ఛిద్రమై పోతున్నాయి.

-చుక్కా రామయ్య