Others

అంతా ఉత్తిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలిలో తళుక్కున మెరిసి, కలిసొచ్చిన అవకాశాలతో తెలుగు, హిందీ భాషల్లో బిజీ అయ్యింది తమన్నా. బాలీవుడ్‌లో పాగా వేయాలన్న కోరికను బాహుబలి తీర్చడమే కాదు, ఇబ్బడిముబ్బడిగా అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. తమిళంలోనూ రేంజ్ పెంచుకున్న తమన్నా, తొలిసారి మళయాల స్క్రీన్‌పై కనిపించబోతోందని వార్త విస్తృతంగా ప్రచారమైంది. హీరో సిద్ధార్థ సరసన ‘కుమార సంభవం’ చేస్తోందని, గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోందని కూడా వార్తలొచ్చాయి. ప్రచారం మరింత పెరగడంతో ఎట్టకేలకు తమన్నా స్పందించింది. తాను మళయాల చిత్రంలో నటించడం లేదని, అవన్నీ ఉత్తుత్తి వార్తలేనని ప్రకటించింది. మళయాల స్క్రీన్‌పై కనిపిస్తే తప్పక ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని, అప్పటి వరకూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. ముందు వాటిని పూర్తి చేయడానికే నా ప్రాధాన్యత అంటోంది తమన్నా భాటియా.