Others

కాంగ్రెస్ గళంలో ‘ఉగ్ర’ స్వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతమెంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంతరించిపోతున్నా తన స్వభావాన్ని వదులుకోలేకపోతోంది. ఇటీవల ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ముస్లిం యూనివర్సిటీలను ప్రారంభించాలని అన్నాడు. యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ‘పాకిస్తాన్ సృష్టికర్త’ మహ్మద్ అలీ జిన్నా చిత్రపటం ఇప్పటికీ ఉంది. దేశ విభజన జరిగి ఏడు దశాబ్దాలు గడచినా దానిని తొలగించటానికి యూనివర్సిటీ అధికారులు ఇష్టపడటం లేదు. ఈ అలీగఢ్ యూనివర్సిటీలో ‘సిమి’ అనే విద్యార్థి సంస్థ పాకిస్తాన్ అనుకూల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తోందన్నది బహిరంగ రహస్యం.
అన్ని మతాల వారూ కలసి మెలసి సుఖజీవనం సాగించాలని భారతీయులు ఆశిస్తుంటారు. అయితే, విద్యా సంస్థల్లో కొందరు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నా కాంగ్రెస్ నేతలు వౌనం వహిస్తుంటారు. ముస్లింల ప్రాపకం కోసం అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వోటుబ్యాంకు రాజకీయాలు చేస్తోంది. అఖండ భారత్ నుంచి పాకిస్తాన్ ఏర్పడడానికి దోహదం చేసింది కాంగ్రెస్ నేతలే.
స్వాతంత్య్రం వచ్చాక హిందూ సంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వాలు పలుసార్లు నిషేధం విధించాయి. హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే హిందువులను ఎందుకు ద్వేషిస్తున్నది? మైనారిటీల అభివృద్ధికి తాము కంకణం కట్టుకున్నామని కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పలుసార్లు ప్రకటించాయి. భారత జాతీయ పతాకానికి ‘హిందూ ముస్లిం క్రైస్తవ’ మతాల పేరుతో కాంగ్రెస్ పార్టీ అలనాడు వ్యాఖ్యానం చెప్పింది. అయితే, మైనారిటీల కోసం మెజారిటీ మతస్థులను బలిపెట్టడం తగునా? మెజారిటీ మతస్థులను ‘కాషాయ ఉగ్రవాదులు’గా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సుశీల్‌కుమార్ షిండే, మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, శశి ధరూర్ వంటి నేతలు బృందగానం ఆలపించడం సమంజసమా? దేశం మొత్తాన్ని కశ్మీర్‌గా మార్చి రాజకీయ లబ్ది పొందాలనేదే కాంగ్రెస్ నేతల అంతరంగమా? ఆమధ్య ఓ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ- ‘కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ’ అని అన్నారు. అయితే, ఆ ముస్లింలు సైతం కాంగ్రెస్‌ను ఆదరించడం లేదని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిగ్గుతేల్చాయి.
***
అమెరికాలో చాలా తెలుగు సంఘాలున్నాయి. ఇవి కులాల పరంగానూ నడుస్తున్నాయి. ‘తానా’ సంఘంలో ఓ కులానికి, ‘ఆటా’ సంఘంలో మరో కులానికి ఆధిపత్యం కొనసాగుతోంది. రెండు కులాల వారీగా ఈ సంఘాలు సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతుంటాయి. అమెరికాలో ఇంకా గుజరాతీలు, పంజాబీలు, తమిళులు, కన్నడిగులు తమ తమ ప్రాంతాల వారి కోసం సంఘాలు నడుపుకుంటున్నారు. వీటన్నింటి మధ్య సమన్వయానికి బదులు సంఘర్షణ సాగుతూ ఉంటుంది. మరోవైపు ‘తానా’లోనే వర్గపోరాటం నడుస్తున్నది. ఇటీవల జరిగిన ‘తానా’ సభలకు భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఆహ్వానించారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే ‘దిగిపో.. దిగిపో’ అని కొందరు అవమానించారు. ‘తానా’లో ఆధిపత్యం వహిస్తున్న ఓ సామాజిక వర్గం వారే రాంమాధవ్ పట్ల ఇలా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. భారత్ నుంచి ఓ రాజకీయ నాయకుడిని ఇలా పిలిచి అవమానించటం సంస్కారం కాదు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట ఖండాంతరాలకు చేరుకొన్నా తెలుగువారికి ‘కులం తెగులు’ పోవడం లేదు. అమెరికాలో ఎవరికైనా అక్కడి రాజ్యాంగం వర్తిస్తుంది. కానీ- ‘తానా’, ‘ఆటా’లను తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఆడిస్తుంటారు.
***
తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణంలో ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను కేంద్ర నిఘా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఈ సంస్థ పేరు అన్సారుల్లా. భారత్‌లో ఇస్లామిక్ వాహిబ్ సామ్రాజ్య స్థాపన వీరి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సంస్థ కార్యకర్తలు భారీగా నిధులు సేకరించారు. వీరికి ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయట! సయ్యద్ బుఖారీ, హసన్ అలీ, మహమ్మద్ యాసఫుద్దీన్ వంటి ఉగ్రవాదుల నుండి నిఘా వర్గాలు సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్‌లు సేకరించారు. ద్రవిడ సంస్కృతి పరిరక్షణ పేరుతో రాజకీయ పార్టీలు పెట్టిన తమిళ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
సోమాలియా రాజధాని మొగదిసులోని ఒక హోటల్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది విదేశీ యాత్రికులను, 60 మంది పౌరులను హత్య చేయడమో గాయపరచటమో చేశారు. ఈ అమాయక టూరిస్టులు చేసిన పాపం ఏమిటి? ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలుకుతున్న అసదుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పటేల్ వంటి నేతలు దీనికి సమాధానం చెప్పాలి. శ్రీలంకలో ఈస్టర్ పర్వదినం రోజున భారీ సంఖ్యలో క్రైస్తవ మతస్థులను ఒక చర్చిలో ఎందుకు సామూహికంగా హత్య చేశారు? ఇలాంటి మతోన్మాద సంస్థల కిరాతకాలను మన నాయకులు ఎందుకు ఖండించరు. ‘సెక్యులరిజం’ ముసుగులో నీతులు వల్లించే వామపక్ష నేతలు, మేధావులు, రచయితలకు ఈ మారణ హోమం గురించి పట్టదా?

-డా. ముదిగొండ శివప్రసాద్