Others

రామబాణ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లారుముద్దుగా ముగ్గురు అమ్మల ముద్దు బిడ్డడిగా పెరుగుతన్న రామలక్ష్మణులకోసం ఓ రోజు విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన కు అతిథి మర్యాదలు దశరథుడు చేశాడు. ఉచితాసనం మీద కూర్చున్న తరువాత క్షేమసమాచారాలు తెలుసుకొని తనతో కూడా యాగరక్షణకు నీ కుమారులైన రామలక్ష్మణులను పంపించమని విశ్వామిత్రుడు దశరథుడిని కోరుతాడు.
దశరథుడు భయపడి మహర్షి వర్యానేనే మీకు యాగ రక్షణకోసం వస్తాను. మీ యాగం పూర్తయ్యేవరకు అక్కడే ఉంటాను. రామలక్ష్మణులు చాలా చిన్నవారు వారు రాక్షసులను ఎలా నిలువరిస్తారు అన్నాడు.
దానికి విశ్వామిత్రుడు నీవు అక్కర్లేదు కానీ వారే నాకు కావాలి అని పట్టుపడతాడు. అపుడు వశిష్ఠుడు దశరథునికి నచ్చజెప్పి విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుతాడు. చివరకు దశరథుని ఆజ్ఞతోనే రామలక్ష్మణులు విశ్వామిత్రునితో బయలుదేరుతారు. వారు విశ్వామిత్రుని సలహాతో యాగరక్షణ థీక్ష పూనుతారు. వారికి అనేక దివ్యఅస్తశ్రస్త్రాలు, బల, అతిబల అనే మహావిద్యలను విశ్వామిత్రుడు వారికి ఉపదేశిస్తాడు. దారిలో వారికి వారి వ్యక్తిత్వ వికాసానికి, మేధోవికాసానికి పనికివచ్చే ఎన్నో కథలు చెప్తాడు. అయిదు అహోరాత్రాలు వారు ఏకాగ్రతతో తపోవనాన్ని కావలి కాశారు. ఆరో రోజు వర్షాకాల మేఘాల్లా ఆకాశం మాయమబ్బులతో నిండిపోయింది. అజ్ఞానం చేత రామలక్ష్మణులను పిల్లవాళ్ళుగా భావించి, వికటంగా నవ్వుతూ సుబాహుతో కలిసి మారీచుడు నెత్తురు వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
మారీచుడు తాటకి అనే యక్షణికి సునందుని వలన జన్మించాడు. అగస్త్య మహర్షి శాపంవల్ల సునందుడు మరణించాడు. తండ్రిని చంపివేశాడన్న కోపంతో తనమీద పడబోతున్న మారీచుణ్ణి అగస్త్య మహర్షి ‘నీవు రాక్షసుడవు అయిపోదువుగాక’ అని శపించాడు. మరుక్షణమే మారీచుడు క్రూరకర్ముడై తన అనుచరగణంతో మహర్షుల తపస్సుకు, యజ్ఞాలకు భంగం కలిగించసాగాడు...
మారీచ, సుబాహులను చూస్తూనే శ్రీరాముడు మహాక్రోధంతో శక్తివంతమైన ఆగ్నేయాస్త్రాన్ని వారిపై ప్రయోగించాడు. అది సుబాహునికి తగిలి నేలగూలి అతడు మరణించాడు. మరల రాముడు మానవాస్త్రాన్ని మారీచునిపై వదిలిపెట్టాడు. జంఝామారుతం దూది పింజను ఎగురగొట్టినట్లుగా ఆ మానవాస్త్రం మారీచుణ్ణి నూరు యోజనాల దూరం ఎగరేసుకుపోయి మహాసాగరంలో పడవేసింది. ఆకాశం నిర్మలమైంది. యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది. సహస్ర నాగబలుడైన మారీచుడు నెమ్మదిగా సముద్రంలోంచి బయటపడి దండకారణ్యాన్ని చేరుకున్నాడు. తిరిగి దండకారణ్యంలో ఉండే తాపసులను హింసించుదాం అనుకొన్నాడు. కానీ మారీచుడికి కోదండ రాముడు కనిపించాడు. మారీచుని కళ్ళకు ఎటుచూసినా లక్షలాదిగా రామాకృతులే కనపడసాగాయి. ఆ అడవి అంతా అతడికి రామమయంగా తోచసాగింది. శూన్యంలో రాముడు, కలలో రాముడు, అది ఇది అననేల సర్వే సర్వత్రా మారీచుడికి రాముడే సాక్షాత్కరించసాగాడు. కోదండరాముని వినుర్ముక్త శరం అప్రతిహతం, అమోఘం, అమేయం, దాని శక్తి అపారం అని మారీచుడికి అర్థమైంది.
ఆనాటి నుంచి రాక్షసకృత్యాలు వదిలివేసి మారీచుడు జటావల్క్ధారియై కృష్ణాజనం కప్పుకొని మనోనిగ్రహంతో తపోనిష్ఠలో యోగ్యుడయ్యాడు. అహర్నిశమూ రామనామాన్ని జపిస్తూ కాలం గడుపుతుండేవాడు. రామబాణ ప్రభావాన్ని అనుక్షణం తల్చుకుంటూ నియతాహారియై జీవించసాగాడు.సీతాదేవి అపహరణ సమయంలో ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా మాయామృగ రూపంలో రావణుడికి సహకరించిన మారీచుడు చివరకు రామబాణహతుడై మోక్షాన్ని పొందాడు.

- ఆర్. రామారావు