Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సూర్యుడు సూర్యప్రభ- ఒకరౌచును వేరౌచును
ఒక తేజోవలయమ్మున- ఒక బాటన నడిచినారు.

వారలగని పౌరులెల్ల అచ్చెరువున మునిగినారు
చెరువులోని తామరలన తమ కన్నుల తెరచినారు.

ముట్టిన కందెడు బుగ్గలు- బుగ్గలపై దరహాసం
మాసము లెవ్వారలంచు తలలెత్తిన మీనమ్ములు.

‘‘మునినంటిన మునిబాలురొ? లేక రాచకొమరులొ?
విల్లువెంట శరములట్లు ఎవరో ఈ కొమరులు?

గాలివోలె తేలిపోయి, నీరం వలె సగిపోయి
కాంతివోలె వ్యాపించుచు- పూలవోలె నవ్వుచు.

ఎవరో? వీరెవరో? ఇటు దూకిన ఝరులు?
నగవుల నలదెసల చిలికి వీచిన తెమ్మరలు?

కత్తులవలె మెరసిపోవు చూపులతో నొరసికొంచు
గోవువెంట సాగిపోవు సింగమ్ముల తలపించుచు.

ఎత్తిన బాకుల వోలెను, సంధించిన శరములట్లు
లేచిన బల్లెముల పోల్కి, నిటువచ్చిన యోధులు.

ఆ ముని విశ్వామిత్రుడె! అతని వెంట వీరలెవరు?
ఏ మేనక వీరినిగనె? ఏ రాజ్యము వీరేలిరి?
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087