Others

వేడెక్కిన సాగరం.. విలయానికి సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాలు గతంలో తాము అంచనా వేసిన దానికంటే అత్యంత వేగంగా వేడెక్కుతున్నాయని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూగోళంలో మూడింట రెండు వంతులు సముద్రం ఆవరించి ఉంది. మిగిలిన ఒక వంతు భూ భాగం. ఈ భూ భాగం వేడిని భూగర్భ జలాలు కొంతమేరకు ఉపశమింప జేస్తుంటాయి. అయితే, భూగర్భ జలాలు చాలాచోట్ల అంతరించిపోతుండడం వల్ల భూమి వేడి అంతర్లీనంగా సముద్రాలలోకి వ్యాపిస్తుండడం వల్ల సాగర జలాలు ఇంతకు ముందు కంటే వేగంగా, ఎక్కువగా వేడెక్కుతున్నాయి.
వాతావరణంలో మార్పుల వల్ల భూగోళం మీది సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. అయితే శాస్త్రవేత్తల అంచనాలకు మించి ఇటీవలి కాలంలో సముద్ర జలాలు వేడెక్కడంలో వేగం పెరిగింది. 1950ల చివరి దాకా సముద్ర జలాలలో మార్పులు నిలకడగా ఉండేవనీ, ఆ తరువాతే ఆ జలాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడం మొదలయ్యిందనీ ‘సైన్స్’ జర్నల్ జనవరి 2019లో ప్రచురితమైన సిఎన్‌ఎన్ నివేదిక పేర్కొంటోంది.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక కమిటీ 2014లో పేర్కొన్న అంచనాల కంటే ప్రస్తుతం సముద్ర జలాలు సగటున 40 శాతం వేగంగా వేడెక్కుతున్నాయని సైన్స్ జర్నల్ (11 జనవరి, 2019)లో ప్రచురితమైన ‘హౌ ఫాస్ట్ ది ఓషన్స్ ఆర్ వార్మింగ్’ వ్యాసంలో వివరించారు. భూగోళంలో ఉష్ణోగ్రతలు పెరగడంలో సాగర జలాల ప్రధాన పాత్ర వహిస్తుండడంవల్ల వాతావరణ శాస్తవ్రేత్తలు తమ పరిశోధనలను ఆ వైపు మళ్ళిస్తున్నారు. సాగర జలాల సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణంలోకి విడుదల చేయబడుతున్న విషవాయువుల ప్రభావానికి ఒక సూచికగా పరిగణించవచ్చునని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన జెక్ హౌస్ ఫాదర్ అంటున్నారు. సాగర జలాలు వేడెక్కిపోయి వ్యాకోచించడంతో సముద్ర మట్టం పెరుగుతోంది.
ఇప్పటిదాకా ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరగడం కన్నా సాగర జలాలు వేడెక్కడం వల్లనే సముద్ర మట్టం ఎక్కువగా పెరుగుతోందని శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి విషవాయువుల పెరుగుదలను నిరోధించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందువల్ల ముందు ముందు సముద్ర మట్టం మరింత పెరగనుంది. దీనివల్ల ప్రపంచంలోని తీర ప్రాంత నగరాలు భారీగా నష్టపోనున్నాయి.
‘‘2018లో సముద్ర జలాలలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ నమోదు కాబోతున్నాయి’’ అని జెక్ హౌస్ ఫాదర్ హెచ్చరిస్తున్నారు. ‘బెర్క్లీఎర్త్’ పేరుతో నిర్వహిస్తున్న వాతావరణ పరిశోధన సంస్థలో ఎనర్జీ సిస్టమ్స్ ఎనలిస్టుగా ఈయన పనిచేస్తున్నారు. సముద్ర జలాలలో వచ్చే మార్పులను అధ్యయనం చెయ్యడానికి రూపొందించిన అత్యాధునిక ‘ఆగ్రో సిస్టమ్’ను అనుసరించి శాస్తజ్ఞ్రులు జరిపిన పరిశోధనల వివరాలను ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల మూడువేల రోబోటిక్ కదలికల ద్వారా సముద్ర జలాలలో ఉష్ణోగ్రతలు, లవణ సాంద్రతలలో వస్తున్న మా ర్పులను శాస్తవ్రేత్తలు అధ్యయనం చేసారు. ఈ పరిశోధనల ద్వారా సేకరించిన వివరాలను, అంతకుముందరి పరిశోధనల వివరాలను కలిపి అధ్యయనం చేసి వారు అంశాలను తెలిపారు.
‘ఒక రకంగా చెప్పాలంటే భూగోళంపై మూడింట రెండువంతులు నిండి ఉన్న సముద్రాన్ని గొప్ప జ్ఞాపకాల నిధిగా చూడవచ్చు. ఈ సాగర జలాలను లోతుగా అధ్యయనం చేసినట్లయితే శతాబ్దాలుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను, శీతల ప్రాంతాలలో మంచు కరిగే తీరులో వస్తున్న మార్పులను గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు. నిజానికి భూగోళ వాతావరణంలోని సమతౌల్యం 93 శాతం కాపాడబడుతున్నది సముద్ర జలాల వల్లనే. గ్లోబల్ వార్మింగ్ అన్నది ప్రధానంగా సముద్ర జలాలు వెడేక్కడం మీదనే ఆధారపడి ఉంది’’ అని కెవిన్ ఎద్వార్డ్ ట్రెనె్బర్త్ అంటారు. ఈయన ‘క్లైమేట్ అనాలసిస్ సెక్షన్’ పేరుతో అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్పెరిక్ రీసెర్చ్ వెలువరించిన నివేదిక రూపకర్తలలో ఒకరు.
సముద్ర జలాలు వేడెక్కినట్లయితే ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలు తీవ్రమైన వరదల తాకిడికి గురవుతాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల వర్షపాతం ఎక్కువై ఫ్లోరెన్స్, హార్వే లాంటి ప్రాంతాలలో హరికేన్ వంటి తుఫానులకు కారణవౌతున్నాయి. ఇది పెద్దమొత్తంలో ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగిస్తోంది.
సాగర జలాలు వేడెక్కడం అన్నది తీర ప్రాంతాల పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రమట్టం పెరగడం, హరికేన్ వంటి తీవ్రమైన తుఫానుల వంటి ఉత్పాతాలు తీర ప్రాంతాలను తరచుగా విధ్వంసానికి గురిచేయడం ఇటీవలి సంవత్సరాలలో చూస్తున్నదే. అంతేకాదు, హరికేన్ వంటి తుఫానులు రాబోయే రోజుల్లో సాధారణ విషయంగా అయిపోతుందని, తరచుగా సంభవించే తుఫాను బీభత్సాల వల్ల సముద్రాలలోని మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందువల్ల ప్రపంచంలోని అత్యధికులు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కోనున్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సాగర జలాలు వేడెక్కడం వల్ల తీర ప్రాంత నగరాలలో జీవించే వారికి పరోక్ష ఇబ్బందులు కూడా ఉన్నాయి. సాగర జలాలు వేడెక్కితే పెద్దసంఖ్యలో చేపలు వంటివి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి. దీనివల్ల మత్స్య సంపదపై ఆధారపడిన తీర ప్రాంత నగరాల్లో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. ఇది వివిధ దేశాల మద్య సంఘర్షణలకు దారితీసి వాణిజ్య యుద్ధాలు జరగవచ్చు కూడా. అదే జరిగితే కొత్త కొత్త వివాదాలు పుట్టుకొచ్చి వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి అని అమెరికాకి చెందిన ప్రముఖ డాక్టర్ పిన్‌స్కీ అంటారు.
సముద్ర జలాల ఉష్ణోగ్రతలలో మార్పులు భూమి ఉత్తరార్ధ గోళంలో బలమైన ఈదురుగాలులకు కారణవౌతున్నాయి. దానివల్ల ఆర్కిటిక్ నుండి చల్లని గాలులు సుదూర దక్షిణాది ప్రాంతాలకు వీచి అక్కడ శీతాకాలంలో చలి మరింత ఎక్కువౌతోంది. ఇది ముఖ్యంగా పెగ్విన్లు, ధ్రువ ప్రాంతాల ఎలుగుబంట్ల మనుగడకు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి.
సముద్ర జలాల ఉష్ణోగ్రతలు ఉండాల్సిన స్థాయిలో ఉంటే భూవాతావరణంలో సంతులనం దెబ్బతినకుండా ఉంటుంది. అన్నీ కాలానుగుణంగా జరుగుతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు అడ్డూఅదుపూ లేకుండా గాలిలోకి వదులుతున్న విషవాయువుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలలో 93 శాతం సముద్ర జలాలు పీల్చుకుంటున్నాయి. ఇది భూగోళ వాతావరణంలో సమతూల్యాన్ని దెబ్బతీస్తోంది.

-ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690