Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నల్లనివాడె శివుని ధనువునెత్త బాగుండును
ఈ నవ్వులప్రోవె సీత జేబట్టిన బాగుండును.

ఈ ఎర్రని కుర్రవాడె ఊర్మిళమ్మకెంతొ తగును
ఈ కరములు, ఆ కరములు కలిసినచో శుభకరమ్ము’’.

అనుచు జనులు అనుకొనిరి, అనుకొంచును ముదమందిరి
ఎవరి భావనలు వారివి! ఎవరి దీవెనలు వారివి!

భగవానుడె తన మాటల పంచిపెట్టి, పదుగురకును
తానొక రాయై మూలన నుండి చోద్యమరయు నేమొ!

లేకున్నను భవిష్యమ్ము నరునకెట్లు తెలియును?
లేకున్నను భావిపురాణమ్ము లెట్లు పుట్టును?

అందమైన నందనమ్ము ఆ మిథిలానగరమ్ము
ఎటు చూచిన అటు తోటలు రాశులె ఫలరాశులు.

ఎటు చూచిన పూబాటలు! పరిమళాల సయ్యాటలు!
పూలవోలె నగవులొలుకు పూబోణుల సందడులు!

కొంత దూరమటుల నేగి, విశ్రమించె మునివర్యుడు
విశ్రమించినారు వారు అంతట ఆతని తోడుత.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087