Others

కవియే రససిద్ధి వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపతి వేద మంత్రప్రార్థనలో ఓం గణానాంత్వాగణపతిగ్‌ం హవామహే కవిం కవీనామ్ ముపమశ్రమవస్తమమ్ అంటారు. భగవదీగతలో ‘కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాం సమనుస్మరేద్యః’అంటారు
కవిశబ్దానికి అర్థము సర్వజ్ఞుడని, కవులకు కవి అంటే పరమ కవియైన పరమాత్మ యని అర్థం . ఋషియైన వాడే కావ్యవస్తువు వ్రాస్తాడని ప్రతీతి. అతడు దార్శనికుడు. ఇప్పుడు కవి శబ్దం జనరంజకమైన కవిత వ్రాసేవారికి చెపుతారు. కవి యొక్క స్ఫూర్తి ఆంతరంగికము, బాహ్యము అని రెండువిధాలు. బాహ్య వస్తువుల నుండి ప్రేరణ పొంది వ్రాసేది ఒకటైతే అంతరంగంలో హృదయాకాశపు లోతులను స్పృశించి వ్రాసేది మరియొకటి. కవికి కావలసిన పనిముట్లు 1. భాషా జ్ఞానము, 2. భావసంపద, 3. అంతర, బాహ్య పరిశోధన 4. విశేష గ్రంథావలోకనము.
ఇవి సమాంతరంగా ప్రవహిస్తే కావ్య వస్తువు అనుకొన్న దిశకు పయనించి కావ్యప్రయోజము సిద్ధిస్తుంది. కొందరు వస్తువులను చూసి కాక వస్తువుల లో నుండి చూడాలంటారు. వస్తువులోనికి వెళితే వస్తు ధర్మము కవిని ఆవేశించి, కావ్య ఆవిష్కరణకు విఘాతం కలుగవచ్చు. కవి వస్తువును ఆవేశించవచ్చును. కాని వస్తువు కవిని ఆవేశించరాదు. అదేదో విదేశంలో నదిని ప్రాణమున్న వ్యక్తిగా పరిగణింరట. నది తన బాధ న్యాయస్థానానికి విన్నవించుకుంది. కవి ఆత్మలో ఒక భాగమైన అది విలక్షణమైనది. దానినే కవితాత్మ అంటారు. కవి నవ రసములు పండించునపుడు, భావ తాదాత్మ్యతకు లోనౌతారు. జాగ్రత్తగా ఏ రసంలో చిక్కుకొనక కావ్య ప్రయోజనం కాపాడాలి. కవి వేదన నుండే కవిత్వంసాధారణంగా జనిస్తుంది.
వాల్మీకి మహర్షికి రామతారక మంత్రోపదేశమైన తర్వాత బహిర్ముఖుడై వెళుతుంటే ఒక దృశ్యం అతణ్ణి కలచివేసింది. ఒక వేటగాడు పక్షులను కొట్టడం అందులో మగ పక్షి నేలకూలడం, ఆడుపక్షి అమితంగా విలపించడం ఆ దృశ్యాన్ని చూసి ‘మానిషాద ప్రతిష్టాంత త్వమగ్ ... ’అని అతని నోటివెంట అప్రయత్నంగా శ్లోకం వెలువడుతుంది. శోకము నుండి శ్లోకము ఉద్భవించిందపుడే.ఆ వేదనే రామాయణ మహాకావ్యానికి అంకురార్పణ జరిగింది. మానసిక నిపుణులు అన్నట్టు మన మెదడులో 10శాతం మాత్రమే వాడుతున్నాం. అలాగే మన నిఘంటువులో 10 శాతమే శబ్దాలను వాడుతున్నాము. కవులు 15 లేక 20 శాతం వాడుతుంటారు. భాషా పటిమ కొందరిలో ఉంటే భావనాపటిమ మరికొందరిలో ఉంటుంది. ఈ రెండింటినిసమాంతరంగా సమతుల్యం గా మేళవించి అందులో జీవధాతువును నింపి నడిపించే వాడే కవి.
శంకర భగవత్పాదులు శబ్ద ప్రయోగాలను గురించి వివేక చూడామణిలో
శబ్ద జాలం మహారణ్యం
చిత్త భ్రమణకారకం అన్నారు.
శబ్దజాలానికి దాసుడైతే తెలియకనే అహంకారం ప్రవేశించి అసూయాగ్రస్తుడై దుర్గమమైన అరణ్యంలో దారి తప్పుతాడు.
ఎందరో మహనీయులు మహారచనలు చేశారు. పోతన భాగవతం లో భక్తి ప్రవహిస్తుంది. పోతన పలికెడి భాగవతమట పలికించెడివాడు రామభద్రుడట అన్నారు. భావ ప్రక్రియ భాషారూపంలో సశరీరంగా రావాలంటే పరా, పశ్యంతి, మధ్యమ, వాగ్, వైఖరీ రూపంలో పయనిస్తుంది. అది ఎక్కువ కాలం మనగలగాలి అంటే అంతర్యామి అనుగ్రహం కావాలి. దీనినే రససిద్ధి అన్నారు.
స్వరములు ఏదైనా, రాగాలెన్నో అన్నట్టు అచ్చులు, హల్లులు కలిపి 56 అయినా అందులో అనంత శబ్ద విన్యాము చేయవచ్చును. అక్షరం ఎవరి సొత్తంటే అక్షరుడిదే. క్షరుడిది కాదు. కవిత పద్యరూపంలో ఉండాలా? లేక గద్యరూపంలో ఉండాలా మాత్రాఛంధస్సులోనా, ద్విపదలోనా, అంటే అది ఏ రూపంలో ఉన్నా పఠితలను కదిలించాలి. కనిపించాలి. హృదయగ్రంథులను తాకాలి. రసోత్పాతము జరగాలి. అపుడే కవి అనుకొన్నది సాధిస్తాడు. ఆ కవే గణపతి అంటే పరమాత్మ అవుతాడు.

- కె. రఘునాథ్ 9912190466