Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎంత అందమీపురమ్ము? పురమంతయు తోటలే!
ఎన్ని విధముల సుమములు? పురమే ఒక సుమహారం!’’

అని పలికెన శ్రీరాముడు
అవుననియెను లక్ష్మణుండు.

‘‘ఎవరంచును జనకుడనిన ఎంచినారు మీరు?
ఆ పాదము సోకినచో శిలలనైన పుట్టు జలలు!

ఆ కరమ్ము శుభకరమ్ము మ్రోడులైన పల్లవించు
ఆ పదమ్ము మోక్షపదం- మట్టియైన గుభాళించు

మహామహుడు జనకుండు- మీ తండ్రికి నేస్తం
శత సహస్రదళ పుష్పం అతని మనోనేత్రం.

శ్రీకళలకు నిలయవ్మౌ- సీతయతని పుత్త్రిక
నాగటి చాలున దొరికెను- నాజూకున పెరిగెను.

హరివిల్లే సీతయనిన- హరిచందన చందం
రతియైనను ఎదురైనను- పడును ఆమె కాళ్ళను.

పూలజూచి, లతల జూచి, మురిసినారు మీరు!
సీతమ్మే ఎదురైనను ఏమగు మీ తీరు?’’

అనినప్పుడు మునియట్టుల కనవలె వారల తీరును!
మొగ్గలు వేసెను సిగ్గులు! మనము చిందులేసెను!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087