Others

ధ్యానమే సర్వోత్తమ మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్యానము అంటే ఒక వస్తువు మీద లేక ఒక నామం మీద మనస్సును ఏకాగ్రముగా నిలుపుట. ‘్ధ్యస’ సహజంగా దేనిమీద పోతే మనస్సు కూడా దానిమీదే లగ్నమవుతుంది. ఒక వస్తువు గూర్చి తదేక నిష్టతో ధ్యానించునపుడు మనస్సులో ఒక ఆనంద అనుభూతి కలుగుతుంది. మానవ శరీరం, ప్రాణము, మనస్సుకు సంబంధించినది. శరీరము, ప్రాణము, మనస్సు- ఈ మూడింటిని ఏకం చేసి ఒకే విషయంపై మీదే కేంద్రీకరించడమే ధ్యానం. మనోవాక్కాయ కర్మలా భగవంతున్ని ప్రార్థించడమూ ధ్యానమనే అంటారు.
కొందరు కేవలం శ్వాసమీద కూడా ధ్యాస పెట్టి ధ్యానం చేస్తుంటారు. మరికొందరు వారి వారి బుద్ధిబలమునుబట్టి, పరిపూర్ణ విశ్వాసంతో, ధ్యానము ద్వారా క్రమానుగతమగు అభ్యాసంతో ‘్భగవంతుని’ ఆరాధన చేసుకూంటూ ఉంటారు. మన మనోభావముననుసరించియే భగవంతుడు వారికి దర్శనమిస్తాడు. ఎందుకంటే భగవంతునికి రూపం లేదు. నామం లేదు. కానీ భక్తులు కోరుకున్న రూపంలో భగవంతుడు వ్యక్తం అవుతాడు. కనుక భక్తుడు తదేక ధ్యానంతో మనస్సును నిలిపి ఒకరూపాన్ని లేదా ఒక నామాన్ని ధ్యానం చేసినట్లయతే అనుకోని, వూహించని అనిర్వచనీయమైన అనుభూతులు కలుగు తాయ.
కానీ ఇలా ధ్యానం చేయడం అందులో ఫలితాలు పొందడం అనేది చాలా కష్టతరం. మనస్సు క్షణమైనా స్థిరంగా ఏ ఆలోచనలు లేకుండాను, ఉండదు. అంతేకాక ఒకే ఆలోచనపైన కూడా నిలువదు. అటువంటి మనస్సును స్థిరం చేయడానికి, నిశ్చలం చేయడానికి ఈ ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది. మొదలు కష్టం అనిపించినా చివరకు అద్భుతమైన ఫలితాలను రాబట్టడానికి మనస్సుపైన విజయం సాధించడానికి ధ్యానమే మార్గంగా మారుతుంది.
ధ్యానం చేయడంలో ముందుకు వెళ్లాలంటే ముందు పరిశుభ్రమైన ప్రదేశంలో, ప్రశాంతమైన వాతావరణంలో, బాహ్యం లోనూ, అంతఃకరణంలోను స్వచ్ఛతతో సుఖాసనం అంటే స్థిరంగా కూర్చోగలిగే ఆసనంపై కూర్చుని, సాధకునికి అనుకూలమైన శారీరకాసనమును ననుసరించి స్థిరముగా కూర్చుని, శాంత మనస్కుడై ప్రాణాయామాన్ని ఆచరించాలి. మనో నిగ్రహంతో ఆ భగవంతున్ని ప్రార్థించాలి. ఇట్లా చేసి నట్లయతే ‘్ధ్యనము’ సాఫీగా సాగుతుందని అని విజ్ఞులు చెబుతుంటారు.
ఆధ్యాత్మిక సాధనకు ‘మనస్సు’ నిశ్చలంగా ఉంచుకోవడం అవసరం. అందుకే వ్యాసభగవానులు వారు ఇలా చెప్పారు. ‘‘సర్వే మనోనిగ్రహ లక్షణాంతాః’’ అన్నారు. అనగా దీనిభావం ‘సర్వవ్యవస్థలయందును, సర్వకాలములయందును మనస్సును నిగ్రహించుకొనుట అనే లక్షణము ఉత్తమమైనది. ధ్యానము ద్వారా మనో నిగ్రహాన్ని సాధించకల్గితే అదే మన పాలిట దివ్యశక్తియై ఆ భగవంతుని రూపమై, మనలో సత్య దయాది సద్గుణములను పెంచి, భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలను కలిగించి దివ్యమైన ఆత్మజ్ఞాన మార్గమున మనలను పయనించేటట్లు చేసి, శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.
ఇంతటి శక్తిని ఇచ్చే ధ్యానం చేయడానికి అంటే మనస్సును నిగ్రహించుకోవడానికి స్థ్థిరంగా నిలుపడానికి పూజలు, ప్రార్థనలు లాంటివి కూడా ప్రాధమిక దశలో ఉపకరిస్తాయ.
కానీ, కోటి పూజలు చేయుట వలన వచ్చిన ఫలము స్తోత్రముతో సమానము. అట్టి కోటి స్తోత్రములు చేయుటవల్ల వచ్చిన ఫలము జపముతో సమానము. అట్టి కోటి జపములు చేయుట వలన వచ్చిన ఫలము ధ్యానముతో సమానమంటారు కనుక కొద్దిగా శ్రమించినా సరే రోజుకు నిముషం పాటైనా సరే ధ్యానం చేయడం అభ్యాసం చేసుకోవాలి. కేవలం ధ్యానం అలౌకిక సంపదలనే కాదు లౌకిక సంపదలను కూడా సులభంగా సాధించడానికి మార్గం చూపిస్తుం దని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి