AADIVAVRAM - Others

ఆలస్యం( సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైంది.
చాలా ఆలస్యం జరిగిపోయింది.
ఈ అనుమానం, ఆలోచన రాగానే మనం ఆ పనిని మొదలుపెట్టడం ఆపేస్తాం.
మనల్ని వెనక్కి లాగడానికి ఎన్నో కారణాలు వున్నాయి. అందులో చాలా కారణాలు మనం కల్పించుకున్నవే.
కొన్ని పద బంధాలని మార్చితే బాగుంటుందేమో.
అందులో ముఖ్యమైన పదబంధం - చాలా ఆలస్యం జరిగిపోయింది. దానే్న ఇంగ్లీషులో మనం టూ లేట్ అంటూంటాం.
మన జీవితంలోని చాలా పనులకి ఈ విషయాన్ని వర్తింపచేసుకోవచ్చు. మన చదువుకు కావొచ్చు. ఉద్యోగ విషయంలో కావొచ్చు. అలవాట్ల విషయంలో కావొచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో కావొచ్చు.
చాలా ఆలస్యం జరిగింది.
బాగా ఆలస్యం జరిగింది.
ఇలాంటి పదబంధాలు మనల్ని చాలా నిరుత్సాహానికి గురి చేస్తాయి.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ పదబంధాలని మార్చాలి. ఈ విషయంలో మన మానసిక ధోరణిని మనం పూర్తిగా మార్చుకోవాలి.
దేనికి బాగా ఆలస్యం జరగదు.
దేనికి బాగా ఆలస్యం లేదు.
ఈ విధంగా పదబంధాలని మారిస్తే, ఈ విధంగా మన మానసిక ధోరణిని మార్చుకుంటే మనం మన జీవితంలో పురోగమిస్తాం.
జీవితంలో-
మనం ఎదగడానికి
పురోగమించడానికి వయస్సు, డబ్బుతో సంబంధం ఉంటుంది.
కానీ
అవే పూర్తి స్థానాన్ని ఆక్రమిస్తాయని అనడం సరికాదు.
వయస్సు దాటుతున్నా
డబ్బు లేకున్నా
మనం ఎదగడానికి
పురోగమించడానికి అవకాశం ఉంది.
ఇంకా చాలా ఆలస్యం జరిగిపోలేదు.