Others

టవల్స్‌తో కళాకృతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదడుకు పదును పెట్టాలే గానీ.. సృజనకు ఎలాంటి సరిహద్దులూ లేవు. ‘కళకు కాదేదీ అనర్హం’ అన్నట్లు మనం నిత్యం వాడే సాదాసీదా వస్తువులతోనే అద్భుత దృశ్యాలను ఆవిష్కరించవచ్చు. టవల్స్‌ను పలురకాలుగా మడత పెట్టి విభిన్న ఆకృతులను రూపొందిస్తూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం ఇపుడు చాలాదేశాల్లో ఓ ‘ట్రెండ్’గా మారింది. వివిధ రంగుల్లో, విభిన్న సైజుల్లో లభించే టవల్స్‌తో వింత వింత ఆకారాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ ఆకృతులు గృహాలంకరణకు కొత్తశోభను ఇస్తున్నాయి. ఏనుగులు, కుందేళ్లు, హంసలు, కోతులు, పక్షులు, సోఫాలు, పూలకుండీలు, బొకేలు వంటి ఆకృతుల్ని టవల్స్‌తో తీర్చిదిద్దుతూ, వాటి ఫొటోలను ‘ఫేస్‌బుక్’, ‘ట్విట్టర్’, ‘యూ ట్యూబ్’ వంటి సోషల్ మీడియాలో పెడుతున్నారు. జంతువులు, పక్షుల ఆకృతులు పిల్లల్నే కాదు, పెద్దలనూ ఎంతగానో అలరిస్తున్నాయి. ఇళ్లకు వచ్చే అతిథులు వీటిని చూసి విస్మయం చెందుతున్నారు. టవల్స్‌ను మడత పెట్టడంలోనే అసలైన నైపుణ్యం దాగి ఉండడంతో, ఈ విషయంలో మెళకువలను నేర్పేందుకు ప్రత్యేకంగా కొన్ని సంస్థలు ఆవిర్భవించాయంటే ఈ కళ ఎంతగా విస్తరిస్తుందో అవగతమవుతుంది. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్పులు, సేఫ్టీ పిన్స్ వంటివి ఉంటే చాలు- టవల్స్‌తో కళాకృతులను ఇట్టే ఆవిష్కరించవచ్చని ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. ఒకటి లేదా అంతకుమించి టవల్స్‌ను వినియోగించి భారీ ఆకారాలను రూపొందించేందుకు శిక్షణా సంస్థలు కూడా వెలుస్తున్నాయి. బొమ్మలు తీర్చిదిద్దాక వాటికి కళ్లజోళ్లు, నెక్ టైలు తగిలించడం, సువాసనలు వెదజల్లే అత్తర్లు
జల్లడంతో- ఇవి చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి.