Others

‘‘హలో!’’ ఎవరిదండీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోన్ అయినా, సెల్ అయినా ట్యాబ్‌ఐనా, ఫ్యాబ్ ఐనా, ఎంక్వయిరీ కార్యాలయమైనా, ఏమంటాం? మొట్టమొదట? ‘హలోవ్!’ అంటాం. అసలీ ‘హలో’ ఎప్పుడు పుట్టింది? దీన్ని కనిపెట్టిందెవరు? అదో గాథ!
‘్ఫన్’ అనగా ‘క్రింఖెంల్’ లేదా ‘బుల్లిపెట్టెలో బూచాడు’- మనం ఎత్తుకోంగానే ‘హలోవ్!’ అంటుంది. మనమూ అంతే ‘హలో’ అంటాం తిరిగి.
టెలిఫోన్‌ల సిబ్బం ది అయితే హల్లా.. హల్లోల్లా.. అని ఏవేవో అంటారు. ఎవరేమన్నా, రుూ అద్భుతమైన మాట ప్రపంచంలో వున్న అన్ని భాషల్లోనూ ఒక్కటే. నో తర్జుమా అవసరం.. ‘హలో’ యూనివర్సల్!
ఇది అలగ్జాండర్ గ్రహమ్ బెల్‌గారి గాళ్‌ఫ్రెండు పేరుట. ఆమె పూర్తిపేరు మార్గరెట్ హల్లో. తాను పోయినా, ఫోన్ పోయినా, తన ప్రియురాలి పేరు జనం వాడుకునే మంత్రంగా వుండాలి అనుకున్నాట్ట! గానీ బెల్‌గారు పెళ్లాడిన ఆవిడ పేరు మాబెల్ గార్డనర్. ఆనక మాబెల్ బెల్‌గా మారింది అంతే. మరి రుూవిడ? అంటే ‘హలోగారెవరు’? పైగా బెల్‌గారి భార్య మూగదిట!
దీనిమీద రీసెర్చి చేసిన మహానుభావులు కనిపెట్టిందేమిటీ అంటే- మొట్టమొదట గ్రహమ్ బెల్‌గారు టెలిఫోన్ ఎత్తి అన్నమాటల్లో ఏ గ్రీటింగ్ అనేది లేదు. ఆయనగారు ఇలా అన్నాడు-
‘‘వాట్సన్! కమ్ హియర్. ఐవాన్టా సీయూ’ మరి? ఆనక కొన్నాళ్లకి గ్రహమ్‌బెల్‌గారే మరో ‘బెల్’ కొట్టి ఫోన్లో ‘అహోయ్! అహోయ్!’ అంటూ గ్రీట్ చేద్దామంటూ ప్రతిపాదించాడట. మన ఘటోత్కచుడు (విజయావారి మాయాబజార్) ‘హాయ్ హయ్ నాయకా!’ అంటూ హాయ్ హోయలు కనిపెట్టినట్లు.
ఐతే, తేలింది ఏమిటీ అంటే, మహాసైంటిస్టు థామస్ ఆల్వా ఎడిసన్‌గారు 1877, ఆగస్టు 15న ‘హలో’ని సూచించాడు అని చెబుతున్నారు. ‘హలోవ్! యిదీ అనగా ఆగస్టు 15న మా ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అంటారా మీరు? ఓ.కె!.. ‘హలోవ్’ అనకుండా సంభాషణ మొదలవదు- అంతం కూడా అవదు. అచేత ఫోన్ క్రెడిట్ గ్రాహమ్‌గారిది కాని ‘హలో’ క్రెడిట్ ఎడిసన్‌గారిది- అని ‘బెల్’ కొట్టి చెప్పవచ్చునని- ‘దూరవాణి’ చరిత్రకారుల ఉవాచ. కాగా, మన సందర్భం ఏమిటీ అంటే, ఆగస్టు 15న ‘హలో’కి కూడా పుట్టినరోజే తెల్సుకున్నాం అన్నది.