Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్ఖండనం
జన్నమ్మును గావించుచు జనకుడు కొలువును దీరెను
తారలలో పెనుతారగ తాను మెరసిపోయెను.

వౌనికి ఇరుప్రక్కలందు రామలక్ష్మణులు నిల్చిరి
దివ్యప్రభల వెదజల్లెడు దివిటీలను బోలిరి.

‘‘దశరథ నందనులు వీరు- నాకనుంగు శిష్యులు
రాముండీ అందగాడు! లక్ష్మణుడీ మన్మథుండు!

రాక్షస సంహారమ్మును గావించిరి వీరలు
నా యజ్ఞం రక్షించిన శూరులు ఈ వీరులు.

పిల్లులవలె కనిపించెడు- పులిపిల్లలు వీరలు
చూడ మిణుగురులె కాని- శౌర్యమున సూర్యులు.

ఎనె్నన్నో ధనువులతో ఆడుకొనిన వారలు
నీకడ శివధనువునుంట విని ముచ్చట పడినారలు.

అక్కుజేరునంచు సీత దాని నెక్కు పెట్టువాని
ప్రకటించితి వట వింటిని- వింటిని ఆ వింటిని.

ఏదీ నీ శివధనువు? చూపించుము వీరలకు!
ఏదీ నీ ముద్దుపట్టి? రావించుము సభకు!’’
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087