Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనియెనపుడు గాధేయుడు- మురిసెనెంతొ జనకుడు
‘‘్ధనువునటకు కొనితెమ్మ’’ని- ఆనతిచ్చెనృపుడు.

ఒక చక్రమ్ముల పేటిక నుంచి దాని తెచ్చిరి
కైలాసము తోడ శివుని తెచ్చినటుల తెచ్చిరి.

చక్రమ్ముల తోడ నొక్క చక్రమ్మే కదలెననగ
కదలివచ్చె సీతమ్మయు కదలెనొ విశ్వమ్మనంగ.

పూలతోట నడచి నటుల సీత నడచి వచ్చెను
పూవొక్కటి పూలదండ తెచ్చెననగ తెచ్చెను.

‘‘ఈమె సీత! నా పుత్త్రిక! మహాశివుని ధనువిది!
దీని నెక్కు పెట్టువాని కిత్తును నా పట్టిని!’’

అనుచు సభాసదుల ముందు
ప్రకటించెను జనకుడు.

కనులతోడ ఆజ్ఞ కోరె రాముడు కౌశకుని
కనులు కనులు భాషించెను- కనులె ఆనతిచ్చెను.

లేచినాడు రాముడంత- లేచెనొ బాణమ్మనంగ
వంగినాడు రాముడంత- వంగెనొ ధనువే యనంగ.

వౌనికి ప్రణమిల్లెనతడు- వౌనమ్మున వీక్షించెను
ఒక ప్రక్కన శివుని ధనువు- ఒకప్రక్కన సీతయును
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087