Others

మూషికాసుర సంహారం సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి దోనే చంపలేడు- ఎలుకని మూషికాసురుడు అంటారు కొంతమంది- యింక దానే్నం చంపుతాడు? కానీ- లక్నోలో, రెండో స్టేషన్ అయిన ‘చార్‌బాగ్’ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌ని, పాసింజర్ల సామాన్లని, డాక్యుమెంట్లనీ ఒకటేమిటి? అన్నింటినీ సర్వభక్షకులై తినేసి- లక్షల్లో కాదు కోట్లల్లో నష్టం తీసుకొస్తున్నాయి ఎలుకలు. క్లోక్‌రూమ్‌లో లగేజీ పెడితే- ‘గాయబ్’. వెండార్లు తినుబండారాల బండిని కాసేపు వదిలి దూరంగాపోతే తిండి సరుకు మొత్తం ‘హుష్‌కాకీ’!
సీనియర్ కమ్మర్షియల్ డివిజనల్ ఆఫీసర్- ఎ.కె.సిన్హాగారు చెప్పాడు- ‘‘ఓ ప్రయివేటు కంపెనీకి రుూ ‘మూషికాసురవధ’ కాంట్రాక్టు యిచ్చేశామండీ!’’ అని. అమ్మో! చాలా పెద్ద కాంట్రాక్టు. నాలుగు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు. ప్లాట్‌ఫామ్స్ చాలా వున్నాయి. అది పెద్ద చరిత్రాత్మకమైన అతి పెద్ద స్టేషన్.
1914లో మొదలెట్టి 1923 నాటికి నిర్మాణం పూర్తిచేశారు బ్రిటీష్‌వారు. శిల్ప సౌందర్యం, వాస్తు నిర్మాణ నైపుణ్యం, కోటబురుజుల్లాంటి బురుజులు వగైరాలతో ఓ తాజ్ మహల్‌లాగా, మరో సుల్తాన్‌ల కోటలాగా, గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్‌గా వుంటుంది. కానీ ప్లాట్‌ఫామ్‌ల క్రింద సొరంగాలు తీసి వేరే అండర్‌గ్రౌండ్ సామ్రాజ్యం ఏర్పరచుకున్నాయి మూషికమలు.
రైలు పెట్టెల్నీ, ప్లాట్‌ఫామ్స్‌నీ- ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అన్నట్లు భోంచేసేస్తున్నాయ్- అని, రైల్వే స్ట్ఫా మొత్తం హాహాకారాలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ వచ్చి అంతా సర్వే చేసి గుండెలు బాదుకున్నాడు. ‘‘నెలాఖరునుంచీ, సంహార కార్యక్రమం మొదలెడతాం సార్!’’ అన్నాడు- భయం భయంగా.. నెలకో నలభై వేల రూల ఖర్చు!
వీటిని చంపాలంటే విషం పెట్టాలిగానీ, అది తిని, అవి ఛస్తే, వాటి కళేబరాలు కుళ్లి, ప్లేగు లాంటి వ్యాధి రాకుండా చూడాలి కదా? పైగా, ఎలుకలకి బదులు పాసింజెర్ల పిల్లలు, పిల్లులు, కుక్కలు ఆ విషం తిని ఛస్తే? పైగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టిన రూల్సు ప్రకారం విషగుళికలు చేయాలి. అదృష్టం ఏమిటీ అంటే- కుక్కల బెడద కాదు యిది ఎలుకల పీడ- కుక్కలనైతే చంపలేరు. జీవకారుణ్య సంఘం, పోలీసులు ముందే మనుషుల్ని మూసేస్తారు సదరు కాంట్రాక్టర్ శాల్తీలని లేపేస్తారు. అదండీ సంగతి!