అందరికీ నచ్చే జానకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్‌రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రల్లో ప్రవీణ్ చందర్ నెల్లుట్ల దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రామ్ మాట్లాడుతూ,‘మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నాం. ఈనెల 26న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ మాట్లాడుతూ, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడిందని, ముఖ్యంగా పాటలు కూడా మంచి ఆదరణ పొందాయని అన్నారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ, రాజుగారి గది తరువాత ఆనందంగా చేసిన సినిమా ఇదని అన్నారు. శివాజీరాజా మాట్లాడుతూ, సినిమా చూశానని, చాలా బాగా వచ్చిందని, జబర్దస్త్ టీమ్‌తో వస్తున్న ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బోలె, సుధీర్ పాల్గొన్నారు.