Others

కొత్త ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి టాలీవుడ్ చందమామ కాజల్ తన ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ అందుకున్న కాజల్‌కు ఈమధ్య కాస్త బ్రేక్ పడింది. వరుసగా తన సినిమాలన్నీ పరాజయాలు అందుకోవడంతో కాజల్ కాస్త గ్యాప్ ఇచ్చి.. మళ్లీ తన గ్లామర్ అక్కడ తగ్గకుండా కేర్ తీసుకుని తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాజల్ ఓ కొత్త ప్రయోగానికి ఓకే చెప్పడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. తనతో ఆ! సినిమాచేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ఈ ప్రయోగానికి సిద్ధం అయింది. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని టాక్. ప్రశాంత్‌వర్మ తాజాగా రాజశేఖర్‌తో కల్కి చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన మూడో సినిమాగా కాజల్‌తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. గ్లామర్ క్వీన్‌గా సౌత్‌లో ఇమేజ్ తెచ్చుకున్న కాజల్ ప్రస్తుతం కుర్ర హీరోలతో సినిమాలకు ఓకే చెప్పడం విశేషం. కాజల్ సెకండ్ ఇన్నింగ్‌లో చేసిన సీత, బెల్లంకొండ శ్రీనివాస్ జోడిగా కవచం సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు శర్వానంద్ సరసన రణరంగం, జయం రవి సరసన కోమలి సినిమాలు చేసింది. ఈ సినిమాలపైనే ఈ అమ్మడు ఆశలుపెట్టుకుంది. ప్రశాంత్‌వర్మ మొదటి సినిమా ఆ!లో నటించిన కాజల్ ఇప్పుడు అదే దర్శకుడితో మరో ప్రయోగం చేయడం విశేషం.