Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత జన్మలో నేను చేసిన పాపం వల్లనే చేయని నేరానికి ఈ విధమైన కష్టాలను అనుభవిస్తున్నాను. అయినవారి చేతనే నా భర్త రాజ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు భర్తృవియోగాన్ని పొంది నానాబాధలకు లోనయ్యాను. ఇవన్నీ నా పాప ఫలమే!’’అని దమయంతి పరిపరివిధాల తలంచి విలపించింది. అలా విలపిస్తూ కొంత దూరం నడిచింది.
‘‘నేనేమైనా పాపం చేశానా? ఈ నిర్జరారణ్యంలో నేను జన సమూహాన్ని చూడటమేమిటి? వారంతా ఏనుగుల చేత చంపబడటమేమిటి? ఇది తప్పక నా దురదృష్టం వల్లనే జరిగింది. కాలం దాపురించనిదే ఏ వ్యక్తీ తనకు తానుగా మరణించడు’’అని మరలా పరిపరి విధాల తలపోస్తూ, తనలో తానే మాట్లాడుకొంటూ, విలపిస్తూ, తెల్లవారగానే మరణించగా మిగిలిన కొద్దిమందితోనూ, బ్రాహ్మణులతోనూ కలిసి మెలసి నడుస్తూనే సాయం సమయానికి ‘‘సుబాహుని’’యొక్క పురానికి చేరింది. సగం చీరనే ధరించి యున్న దమయంతిని చేదిపురవాసులు చూచారు. ఆమెను చుట్టుముట్టారు.
అయినా అలాగే నడుస్తూ దమయంతి రాజగృహం వరకు చేరింది.
జన సమర్ధంగల రాజమార్గాన్ని సమీపించగా, అదే సమయంలో ‘రాజమాత’ మేడపై నుండి దమయంతిని చూడటం తటస్థించింది. సూర్యరశ్మి చేత వెలవెలబోయి, కాంతిహీనంగా కనబడే ప్రాతఃకాలంలోని చంద్రునివలె ఆకృతిగల దమయంతి రాజమాతకు కనిపించింది.
తన దాదిని రాజమాత పిలిచింది ఆ దాదితో
‘‘చినిగిపోయిన మిక్కిలి మాసిన చీరను కట్టుకొని, దుమ్ముచేత ఎర్రబారిన ముంగురులు అటూనిటూ రేగుతుండగా వస్తున్న ఆ మగువను చూచావా? పిచ్చిదాని వేషం వేసుకొనిని లక్ష్మిదేవివలె ఉన్నది చూడుము! వెంటనే వెళ్ళుము. పోయి వెంటనే ఆమెను నావద్దకు కొనిరమ్ము! ఈమె శరణార్థిని వలె నున్నది. ప్రజలవలన ఇబ్బంది పడుచున్నది. ఈమె రూపం నా ఇల్లంతా వెలుగు నింపుతున్నదనిపిస్తోంది! ఆ దీనురాలపై నాకు అత్యంత ప్రీతి కలుగుచున్నది. వెంటనే వెళ్ళి ఆమెను ఇచటికి తోడ్కొని రమ్ము’’ అని అన్నది.
రాజమాత ఆజ్ఞతో ఆ దాసి వెంటనే పరుగెత్తుక వెళ్ళింది. దమయంతిని చేరింది.
‘‘అమ్మా! నీవెవ్వరవు? నిన్ను చూచి మా రాజమాత ఆశ్చర్యం చెందుచున్నది. నిన్ను వెంటనే తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించింది. దయజేసి నాతోపాటు నీవు మా రాజమాత సన్నిధికి రమ్ము.. భయపడవలసిన పనిలేదు’’అని అన్నది ఆ దాదిచుట్టూ మూగియున్న జనులను వారిస్తూ. దమయంతిని వెంటబెట్టుకొని రాజమాతవద్దకు చేర్చింది. రాజమాత దమయంతిని ఆశ్చర్యంగా చూచింది. ప్రేమతో అన్నది.
‘‘భాగ్యవతీ! మబ్బుల్లో మెరుపులా ప్రకాశిస్తున్నావు! నీవు ఎవరిదానవు? అలంకారాలు లేకున్నా నీ రూపం దివ్యంగానున్నది! ఇలా ఎందకు పరమ శోకమూర్తివై కనిపిస్తున్నావు? నిస్సహాయ స్థితిలోగూడా నీవెవ్వరికీ భయపడటం లేదు.’’ అని.
దమయంతి రాజమాతను తేరిపార చూచింది. ఆత్మీయ మాటలకు మనసు కొంత స్థిమితపడింది. రాజమాతను చూచి
‘‘రాజమాతా! భర్తనే అనుసరించుకొనియుండే స్ర్తిగా నన్ను గ్రహించుము. సౌరంధ్రీ జాతి సంపన్నను. స్వేచ్ఛగా నివసిస్తాను. నా భర్త సద్గుణ సంపన్నుడు. పరాక్రమోపేతుడైన వీరుడు. శత్రువులను జయించినవాడు. విధివశాత్తున అతడు జూదమాడవలసి వచ్చింది. ఆ జూదంలో నా భర్త ఓడిపోయాడు. కట్టుబట్టలతో వనవాసానికి ఒంటరిగానే వెళ్ళాడు. అయితే నేను నా భర్తను నీడవలె వెన్నంటివెళ్ళాను. వీరుడైన నా భర్త ఏ కారణమువల్లనో వనంలో ఆకలితో వికల మనస్కుడై శరీరంమీద బట్టనుగూడా వదలివేశాడు.
అనేక రాత్రులు ఉన్మాదిలా ఉన్న భర్తను అనుసరించి నిద్ర లేని దాననయ్యాను.

- ఇంకాఉంది