Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఫిళఫిళ’’మను మ్రోతలాయె- మిన్ను విరిగెనో యనంగ
విరిగె నంతటను ధనువు- అతని రొట్టె విరిగెననగ.

హరివిల్లే విరిగెననగ హరి విల్లును విరిచెను
విరిజల్లులు కురిసెనంత రాజు మురిసెనంత.

విల్లు విరిగినంతలోనే సీత గుండెలదిరినవి
అల్లె త్రాటివోలె నామె నాడులు కంపించినది.

ఆ సభలో ఆనందపు కెరటమ్ములు పొంగినవి
సభికుల కరతాళ ధ్వనులు గగనమ్మును ముట్టినవి.

మాలతోడ సీతమ్మయె కదలివచ్చె నంతటను
మాలతోడ మాలయొకటి కదలి వచ్చెననగను.

భూమియె యినబింబమ్మును అందుకొనక జూచినట్లు
సీతమ్మయు శ్రీరాముని అందుకొగ జూచెను.

కాని రాముడెంతటికిని అందడు సీతమ్మకు
ఆదిత్యుని అందుకొనగ తరవౌనెవ్వరికి?

చేతికి చిక్కిన ఫలమే నోటి కందకున్నట్లును
నిక్కి, నీల్గి జానకమ్మ వేసె బిక్క ముఖమును.

విశ్వామిత్రుండప్పుడు పరుగు పరుగు నేతెంచెను
‘‘ఇది ఏమిటి రామయ్యా?’’ యనుచు విస్తుబోయెను.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087