Others

ప్రకృతి రక్షణే భావితరాలకు పసిడి పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వకాలంనుంచి గ్రహపూజలు, చెట్లకు మొక్కడాలు, పర్వతాలను పూజించడాలు, గిరి ప్రదక్షిణలు చెయ్యడాలు, నదులకు హారతులివ్వడాలు ఇవన్నీ మనకు ఆచారాలుగా వస్తున్నాయ. ప్రకృతికి పులకించి ఎంతోమంది కవులు వర్ణనలు చేశారు. వసంతగానం చేశారు. విశ్వమానవ కల్యాణం గురించి ప్రార్థించారు. సర్పదోష పరిహార్థమై రాహు కేతు పూజలు చేశారు. కాలపురుషుణ్ణి కొలిచారు. సూర్య నమస్కారాలు చేశారు. అష్టదిక్పాలకుల్ని గౌరవించారు. మన పండుగలు, పబ్బాలు, తీర్థయాటనలు, వనభోజనాలు ఇలా దేనిలోనైనా సరే అంతర్లీనంగా త్యాగగుణ ం, ప్రకృతి పరిరక్షణచేసే బుద్ధిని ఉద్దీప్తం చేసే సంస్కృతి ని మన పూర్వీకులు మనకు అందిస్తూ వచ్చారు.
ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పరసహకారాన్ని అందించుకోవాలన్న సందేశాన్ని ఈ పండుగలు ఆచార వ్యవహారాలు మనకు చెప్తుంటాయ. పర్యావరణంలో ఎప్పటికప్పుడు జరిగే రసాయనిక, భౌతిక, నైసర్గిక మార్పులను నియంత్రించడంలో చెట్ల భూమికను గుర్తించి ‘‘వృక్షోః రక్షత రక్షితః’’ అన్నారు. చెట్లు మనకు పువ్వులు, కాయలు, ఫలాలు మాత్రమే కాదు ప్రాణవాయువునిస్తున్నాయి. జీవరాశులు జీవించడానికి అత్యవసరమైన ‘ప్రాణవాయువు’ మనకు ఎక్కువగా వృక్ష సంపదనుంచే లభ్యవౌతోంది. అలాంటి వృక్షాల్లో మర్రి, తులసి, వేప, రావి మొదలైన వాటికి మనం పూజలు కూడా చేస్తాం. చెట్లు కార్భన్ డై ఆక్సైడు ఆహారోత్పత్తిలో తీసుకొని మనకు ప్రాణవాయువునిస్తే, జంతువుల్లో ఉత్తమమైన గోవు ప్రాణవాయువును పీల్చుకుని తిరిగి ప్రాణ వాయువునిస్తుంది. అందుకే సర్వ దేవతా నిలయం గోవు అని చెప్పి గోమాత ను పూజించమని పెద్దలు చెప్తారు. పెద్దలు ఏర్పరిచిన అన్నీ ఆచార వ్యవ హారాల్లలోను సునిశితంగా పరిశీలిస్తే ఎన్నో గొప్ప విషయాలు శాస్త్ర ప్రమాణాలుగా మనకు అర్థమవుతాయ. ఇంత సహకారాన్ని అందిస్తున్న ప్రకృతిని ఈ మధ్య మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు.
మనిషి ఆధునిక జీవనం అంటూ యంత్రాల ద్వారా, ప్లాస్టిక్ ఉత్పత్తుల ద్వారా పర్యావరణానికి హాని కలిగిస్తూ ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పరుస్తూ భూమిని అత్యంత ఉష్ణమండలంగా మార్చేస్తున్నాడు. నిర్థాక్షిణ్యంగా చెట్లను నరుకుతూ తనకు తానే హాని కలిగించుకుంటున్నాడు. ప్రకృతి మనకు ఎన్నో నయనానందకర దృశ్యాల్ని సమకూరుస్తోంది. హిమాలయాలు, అటవీసంపదలు, జలపాతాలు కనుల విందు చేస్తున్నాయి. ఎక్కడ జన సాంద్రత పెరుగుతుందో అక్కడ ప్రకృతికి విఘాతం ఏర్పస్తున్నాడు.ఇది అంతా మనిషికి శాపంగా పరిగణించకముందే దీన్ని నిరోధించాల్సిన బాధ్యత మనిషి చేపట్టాలి.
మనిషి పాశ్చాత్యపోకడలకు వెళ్లి సనాతన ఆచార వ్యవహారాలను పక్కకు తప్పిస్తున్నారు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. ప్రకృతిని రక్షిద్దామన్న సంకల్పం ప్రతి మనిషిలోనూ రావాలి. ప్రకృతిని రక్షించడానికి ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలి. ప్లాస్టిక్‌ను దూరం చేయాలి. ఆచారవ్యవహారాలను హేతుబద్ధంగా ఆలోచించి అందులో నిగూఢంగా దాగిన రహస్యాలను తెలుసుకొని నేటితరానికి వాటి గొప్పతనాన్ని చెబుతూ వారి చేత సంప్రదాయాలను పాటింపచేయాలి. ఇలా మన దృక్పథంలో మార్పు వస్తేనే రేపటి తరం భవిష్యత్తును బంగారం చేసిన వాళ్లం అవుతాము.

- చివుకుల రామమోహన్