Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాతమ్ముడు లక్ష్మణుండు నాకు బహిఃప్రాణము
వాని విడిచి నాకెట్టుల పెండిలియగు?’’ననెను.

‘‘నా రెండవ కూతురైన ఊర్మిళనే నిచ్చెదను
నీ తక్కిన తమ్ముళ్ళకు నా తమ్ముని కూతుళ్ళను’’

అని రాముని తోడ నుడివె జనకుండా వేళను
అపుడు వంగె రాఘవుండు ఆమెకందునటులను.

వంగ వలెను ఆకసమ్ము తనకు తానుగాను
దానివంచుటకు ఎవ్వరి తరవౌ నిలలోను?

భూమి కొరకు ఆకసమ్మె వంగినదన్నటుల
సీత కొరకు శ్రీరాముడు వంగెను ఆ వేళ.

అందని శ్రీరామునందు కొనియెను సీతమ్మ
అందని యెత్తులకప్పుడు యెదిగెను సీతమ్మ.
వచనం:- విషయమంతా వివరిస్తూ దశరథ మహారాజును ఆహ్వానించాడు జనకుడు. దశరథుడు సపరివారంగా విచ్చేశాడు.

కల్యాణం
మంటికీ మింటికీ పెళ్ళియన్నటుల
మింటినంటగ వేసినారు పందిళ్ళు.

భూమియే ఒక పెద్ద వేదికై వెలిగె
ఊరికూరే పెళ్ళికూతురై కులికె.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087