Others

శే్వతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత దూరం పోయనా
వ్యష్టి సమాజంలోని సమష్టి వ్యాపకం ఒకటే
వ్యక్తి నుంచి వ్యక్తికి
వర్ణ పరిచ్ఛేదం చేసుకుంటున్న
వింత పోకడలన్నీ
వర్గ వ్యామోహాన్ని కౌగలించుకునే బ్రతుకుతున్నాయ
ఆవేశంగా మనుషుల్ని
అనవధిగా ఆకల్ని
స్వప్నాలు వెనకబడిపోతున్న అనర్ధ జాగరణల్ని
సామాజిక పైత్యానికి అనివార్య తర్కంగా
అమర్చుకున్న వేళ
ఉదయాన్ని జార్చుకున్న తూర్పు
పశ్చిమాకాశానికై ప్రాకులాడుతోంది
పిలిచినా పలకని చైత్రం
ఆకులు రాలిన కొమ్మ గొంతులో కూరుకుపోయంది
మోడు నీడలో సేద తీరుతున్న పక్షికి
పాట కలగానే మిగిలింది
దుక్కి దున్ని అలసిపోయన నాగలి
ఎటుప్రక్కకి ఒరిగిపోయందో
పంట చేలో పచ్చిగడ్డి
పడిపడి నవ్వుతోంది,
పరిగ దొరకని పసి నగ్నత్వాన్ని చూసి
ఊరి పొలిమేరల్లో ఆగిపోయన
ఉషస్సును ఆహ్వానించే తీరిక లేనివాడు
నీచంగా వంగిన వాడి కాళ్ళ సందు నీడలో
నిశ్చలంగా నిద్రపోతున్నాడు
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణు సంకల్పంలో ప్రభవం పొందినవాడేనా
ఏడీ? ఆ మనిషి? ఏదీ ఆ మనీష..?
తర్కానికి విశ్వాసానికి ఏర్పడ్డ తగాదాలో
విశ్వాసం వీగిపోయంది
పొద్దు గడవని పగలు - పొద్దు పొడవని రాత్రి
ఒడికారపు శే్లష భంగిమలో
నుడికారపు కడలొత్తుకుంటున్నాయ
నిష్క్రియా వ్యాపకుల నిరవధిక క్రీడకి
చేతులు కదులుతున్న వేళ
క్రమం తప్పిన కార్యోత్సాహమే కార్యక్రమమయంది
అమ్మతనానికి అంగట్లో చోటు దొరికింది
కళ్ళెదుట కనిపిస్తున్న కాల ముకురంలో
నిన్నటి మనుగడ నిలబెట్టిపోయన
వ్రీడాలలి నయగారపు విలువల ముద్రలేవీ లేవు
ఇప్పటి మొగాలు వేఱు - సగాలు వేఱు
బరితెగించిన నెమళ్ళకు బయలంతా మబ్బే
బర్ణం విప్పుకొని మరీ బజారు వెంట పడ్డాయ
ఏ ఇంటి కిటికీలో సూర్యుడు
నిశీ ప్రహస్తమై వాలిపోయాడో
వాంఛల వరద ఆ ఇంటి తలుపే తడుతుంది
బురఖా తగిలించుకున్న
ఆధునిక భంగిమ పేరు నవనాగరికత
మనుషులు నడిచే దారులన్నీ
ఖరీదైన వాసనతో మూసుకుపోయాయ
చరిత్రలో
వెనకబడ్డ ‘ఎఱబఱిక’ చెయదాలన్నీ
చిగురించి - త్రపారహిత లపాగరితమై
సామాజిక ‘మయవడి’గా స్థిరపడ్డాయ
అటు చూడా గంగ నోట్లో ఓల్గా మట్టి
ఇటు చూడీ శవానికి పట్టుబట్ట కట్టి
ఏం సాధించామనీ...?

- సాంధ్యశ్రీ, 8106897404