Others

వందే కృష్ణ్ణం జగద్గురుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుని బాల్యచేష్టలను స్మరించుకుని తరించడం కృష్ణ్భక్తులకు దినచర్యగా ఉంటుంది. కృష్ణ నామస్మరణలోనే వాళ్లు పులకించి పోతుంటారు. కృష్ణుని కేవలం బాల్య చేష్టలే కాదు ఏ విషయంలోకృష్ణుని చర్యలను తల్చుకున్నా ఎంతో విజ్ఞానం వస్తుంది. మనసు ఆహ్లాదమవుతుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. మానసిక వికాసం జరుగుతుంది. అట్లాంటి వాటిల్లో మన్ను తినే కృష్ణయ్య ఒకరు.
ఓసారి ఇతర గోపబాలురలతో కలసి బాలకృష్ణుడు ఆడుకుంటున్నాడు. చిన్మయుడు కదా తన చిద్విలాసాన్ని తన తల్లికి చూపించాలనుకొన్నాడేమో. ఉన్నట్టు ఉండి మట్టి తినడం మొదలెట్టాడు. కూడా ఉన్న పిల్లలంతా కృష్ణ మన్ను తినకు మంచిదికాదు అంటూ చెప్పారు. కానీ వారి మాట వింటాడా మన కిష్టయ్య. ఎందుకోసం మన్ను తింటున్నాడో వారికి తెలియదు కదా. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ చెప్పారు. వారు చెప్పితే వినడం లేదు కదా అని మీ అమ్మతో చెప్తాం అని బెదిరించారు. సరే పోయి చెప్పండి అని కృష్ణుడు వారికి బదులిచ్చాడు. ఇంకేం పిల్లలకు కృష్ణయ్య వాళ్ల అమ్మ కొడుతుంది. అపుడు కానీ తెలియదు. మనం చెబితే వినడం లేదు. చూడు ఇపుడు ఏమి జరుగుతుందో అనుకొంటూ, అంటూ అందరూ ఒక్కసారి పరుగెత్తి వెళ్లి ‘యశోదమ్మ! యశోదమ్మా మేం చెబితే వినకుండా ఈ కృష్ణయ్య మన్ను తింటున్నాడు. దా ..దా... నీవు రా.. ’అంటూ చేయి పట్టుకొని తీసుకొని వెళ్లారు.
చిన్ని కృష్ణుడు ఎప్పటిలా మన్నుతో ఆడుకుంటున్నాడు. యశోదమ్మ కృష్ణయ్యను పట్టుకొని ‘ఏరా మన్ను తిన్నావా? వీళ్లు చెప్పేది నిజమేనా?’అని అడిగింది. పాపం పసిబాలుడు కృష్ణయ్య ‘లేదమ్మా లేదు వీళ్లంతా నాపైన చాడీలు చెబుతున్నారు. వీరి మాటలు వినకమ్మా. నేను ఎందుకు మన్ను తింటాను’ అంటూ గారాలు పోయాడు.
కానీ పక్కన ఉన్న పిల్లలంతా కాదు అమ్మా కాదు వాని నోరును చూపించమను అన్నారు. యశోదమ్మా వారి మాటలు నమ్మింది.
‘ఏది కృష్ణా నిజంగా నువ్వు మన్ను తినకపోతే నీ నోరు చూపించు’అంది. అదికాదమ్మా నిజంగా నేను తినలేదు అంటూ మరింత గారాలు పోతున్నవానిని చూసి యశోదమ్మా వీడు నిజంగా మన్ను తిని ఉంటాడు అనుకొంది చూపిస్తావా లేదా నీ నోరు అంటూ గదమాయించింది.
కృష్ణుడు తల్లీ నా నోరు చూపిస్తే నీవు చూడగలవా అనుకొన్నాడు. కానీ మెల్లగా నోరు తెరిచాడు. ఆ నోటిలో భువన భోంతరాలు యశోదమ్మకు కనిపించాయి. ఆ తల్లికి నోట మాట ఆగిపోయింది. ఆ నోట ఎన్నో బ్రహ్మాండాలు గిర గిరా తిరుగుతున్నాయి. సర్వ ప్రపంచమూ ఆ నోటిలో ఆ తల్లికి కనిపించసాగింది. మ్రాన్పడి పోయి చూస్తున్న యశోదమ్మ వీపు పైన తన చేతినుంచి ‘అమ్మా నీవే చూడమ్మా. నిజంగా నేను మన్ను తిననేలేదు. వీళ్లంతా అబద్ధాలు చెబుతున్నారు.’ అన్నాడు. కృష్ణుని మేని స్పర్శకు ఇహలోకంలోకి వచ్చిన యశోదమ్మ ‘ఏమీ విచిత్రం ఇదెక్కడి చిత్రం నేను చూసింది కలనా నిజమా? ఇంత చిన్నవాని నోటిలో చతుర్ధశ భువనాలు కనిపించడమేమిటి? ఈ చిన్నవాడు నా కొడుకు కదా మరి ఈ చిత్రం ఏమిటి అని జరిగింది విత్కరించుకోలేక పోతోంది. మరలా తన చేతిని యశోదమ్మ నుదుటిపై ఉంచిన కృష్ణయ్య అమ్మా అమ్మా అంటూ గారాలు పోతున్నాడు. తిరిగి ఆమెకు కృష్ణమాయ కమ్మింది. అయ్యో నా చిన్నవానిని అనవసరంగా అనుమానించి గద్దించాను. అసలే చిన్నవాడు ఏమీ తెలియని అమాయకుడు. ఈ అల్లరి పిల్లలు ఎంతగా నా చిన్ని వానిని కష్టపెడుతున్నారో అనుకొని కృష్ణుని ఎత్తుకుని ‘అరేయి పిల్లలూ మీరంతా వెళ్లి ఆడుకోండి. వీనిని నేను చూసుకొంటాను.’ అంటూ గబగబా ఇంట్లోకివెళ్లిందా ఆతల్లి. తల్లి భుజం పైన నుంచి తన స్నేహితులను చూసి నవ్వుతున్న కృష్ణుడిని వాళ్లంతా తెల్లమొహాలు వేసుకొని చూశారు. కృష్ణయ్య హాయిగా తన అమ్మ ఒడిలో మాతృత్వ అమృతాన్ని గ్రోలుతున్నాడు. తల్లి యశోదమ్మ ఆ సర్వసృష్టి కారణమైన వాడిని తన కొడుకు అని మురిసిపోతోంది. ఇది కదా కృష్ణమాయ. ఈ మన్నుతినే ఘట్టాన్ని స్మరించుకొన్నవారికి కృష్ణుని దయ అపారంగా లభ్యమవుతుంది కృష్ణ్భక్తులు అంటారు.

- ఆర్. సుశీల