Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటింట తోరణాలను కట్టినారు
ఊరంత దీపాలు వెలిగించినారు.

ఇనునికీ ధరణికీ పెళ్ళియన్నటుల
ఊరంత వెలుగుల్ల వెల్లువైపోయె.

రాసుల్లతో పూలు రాసుల్లు పండ్లు
కళ్ళు పూలై పూచె పండె బ్రతుకుల్లు.

బానల్లతో పాలు! బానల్లు పెరుగు!
క్షీరదధి సంద్రాలు దొర్లెనో యనగ!

గోరింటవలె నున్న సీత చేతులను
గోరంత గోరింట పంట పండేను.

సూరీడు పోడిచెనన కనుబొమలయందు
సీతదిద్దెను నుదుట సింధూర తిలకం.

ఆ పెదవి తావులను వలచెనో యనగ
కమలాలు పెదవులను సేసె కాపురము.

చొక్కవౌ బంగారు బొమ్మయే యనగా
అచ్చవౌ పగడాల కొమ్మయే యనగా.

నడచి వచ్చెను సీత అందాల మూట
పెళ్ళిపందిరిలోకి నడిచి వచ్చేను.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087