Others

గ్రహించాల్సినవే ఇవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతినుండి మహత్తత్త్వం అహంకారం, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు పంచభూతాలు అనే చతుర్వింశతి తత్త్వాలు ఆవిర్భవించాయి. ఉపాధులన్నింటిలో మనుష్యుని ఉపాధి ఉత్తమోత్తమమైనది. మనిషికి వివేక విచక్షణాలు ఉంటాయ. తాను ఎవరు అనే అనే్వషణ ఇత్యాదు లన్నింటినీ జవాబులను కనుకొనగలిగే సామర్థ్యం ఏర్పడి ఉంటుంది. మిగిలిన జంతువులకు మల్లె క్షుత్సిపాలనతో తృప్తి చెందపు. యుక్తాయుక్త వివేకం, ఆత్మకల్యాణ జ్ఞానం, తత్వానే్వషణ మొదలైన సాధనలతో మోక్షాన్ని సాధించగలుగుతాడు.
సాధనాలు జడములైనప్పటికీ సాధకుడు వీటితో కార్యసిద్ధి పొందవచ్చును. ఇలాంటి మనిషి పంచభూతాలనుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయ. భూమి పంచభూతాలలో ఒకటి. పూర్వకర్మననుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటికి అనువుగా భూమిపైకి పంపిస్తాడు.
మనిషితో పాటు క్రిమికీటకాదులు, పశువులు జంతువులు సర్వ ప్రాణికోటికి భూమి ఆధారం అయ ఉంటుంది. మానవులు భూమిని దున్నుతారు. బావులు చెరువులు కోనేర్ల కోసం భూమిని త్రవ్వుతారు. అయినప్పటికీ భూదేవి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రమము ఇచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవులనుండి తనకెంత బాధ కలిగినా చలించక, తన ధర్మాన్ని తాను అనుసరిస్తోంది. అలాగే మనిషి చెడు వాటికి ఆశపడక సన్మార్గాన్ని వీడక ధర్మ మార్గమునుండి చలించకుండా ధైర్యం గా కాలం గడపాలని భూమినుండి మనిషి నేర్చుకోవలసిన పాఠం. రెండవది జలము- జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యం, చల్లదనమూ ఇస్తుంది. వృక్షాలను సస్యాలనూ పోషిస్తోంది. అన్ని జీవులకూ అంత మేలు చేస్తున్నా, తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతాలలోనే నిలుస్తుంది. అలాగే మానవుడు తన్నాశ్రయించిన వారిని రక్షించాలి. ఎవరికీ కీడు కలిగించకూడదు.
పంచభూతాలలో మూడవది వాయువు- వివిధ వస్తువుల వేడి, చల్ల శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకనే వస్తువులపైన ఆసక్తి లేకుండా అనాసక్తుడై వాటిమధ్య సంచరిస్తుంటాడు. తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా సంచరిస్తాడు. మనం కూడా ఇంద్రియ విషయాలు అనుభవమవుతున్నా సుఖ దుఃఖాది ద్వంద్వాలతో తగుల్కొనకూడదు. బంధాలకు చిక్కిపోక సదా దేవుని స్మరణలో కాలం గడపాలి.
నాల్గవది ఆకాశం- అప్పుడప్పుడు ఆకాశం- మేఘాలు, ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికీ అంటనిది. మనం కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికారమైన దేహానికి దానివలన కలిగిన మనోవికారాలకు అంటీ అంటనట్లు ఉంటూ, ఆకాశంలా స్వచ్ఛంగా ఉండాలని తెలుసుకోవాలి.
పంచభూతాలలో ఐదవది అగ్ని. అగ్ని దేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడివల్లనే ప్రకటమయ్యే అగ్ని తత్త్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగి ఉంటాడు. అట్టి సామాన్య అగ్ని మథనం చేత విశేషాగ్నిగా ప్రకటమై, యజ్ఞం చేసే వారి పూర్వపాపాలను హరించి రానున్న కర్మ దోషాలను నివారించడం కోసం ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు. కానీ తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు గాకనే వారి పాపాన్ని దహిస్తాడు. అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ, కట్టెను చేరినప్పుడు ఆ రూపం భాసిస్తుంది. అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలలో తాదాత్మ్యం చెంది, ఆయా రూపాలలో కన్పిస్తుంది. అగ్ని తత్త్వజ్ఞానాన్ని మానవులు గ్రహించాలి. ఇలా పంచభూతాలనుంచి మనిషి జ్ఞానాన్ని పెంచుకోవాలి.

- ఆర్. పురందర్