Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడలిరాయడె కదలివచ్చెనో యనగ
గగనమ్మె భూమిపై కాలిడెనొ యనగ.

నీలాలె అచ్చోట పొరాడె ననగ
రాముండు విచ్చేసె నీలాలకొండ.

ఉత్తరీయము వ్రేలె మేఘమ్మువోలె
జన్నిదమ్మే కదలె జలధరవోలె.

అతడు కట్టిన పీత వస్తమ్మ్రుకదలె
పసిడి సంద్రమ్మొకటి కదలెనో యనగ.

కంఠాన మెరిసేను ధవళహారమ్ము
రిక్కలనె గుదిగూర్చి కట్టిరో యనగ.

బొడ్డులో తలనెత్తె పిడిబాకు యొకటి
రాజసమ్మే బొడ్డులో దాగెననగ.

రాముడొక గుర్రమ్ముపై నేగుదెంచె
కాముడే గుర్రమ్ముగా మారెననగ.

పైకి పళ్లెరమందు నీలిపాదాల
కెంపు చేతులతోడ వెండి నీరోసి.

సజల నేత్రుండౌచు కాళ్ళు కడిగేను
జనకుండు మాయమై కూతునిచ్చేను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087