Others

వరాలిచ్చే వరలక్ష్మిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! వరలక్ష్మీదేవి! మాకు పుత్ర పౌత్రాభివృద్ధినీ, ఆరోగ్యంతో కూడిన ఆయుష్షును ప్రసాదించవలసింది’ అంటూ స్ర్తిలందరూ కోరుకునే తల్లి వరలక్ష్మీదేవి. ఈ తల్లినే స్వయంగా చారుమతికి శ్రావణపూర్ణిమకు ముందు వచ్చేశుక్రవారం నాడు తనను పూజించమని చెప్పిందనే వ్రతకథను ఆధారం చేసుకొని స్ర్తీలందరూ శుక్రవారం లక్ష్మినే వరలక్ష్మిగా పూజిస్తారు.
సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు ఈ వ్రత మహత్మ్యం చెప్పాడు. అసలీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడనేది పురాణ వచనం. వరలక్ష్మీవ్రతం ఆచరించినవారందరూ సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాదులతో సుఖంగా, సిరిసంపదలతో జీవిస్తారు. ఈ లక్ష్మివైభవాన్ని వేదాలు, పురా ణాలు వేనోళ్ల కీర్తిస్తు న్నాయ. ఈ తల్లి జగద్వ్యాపకాన్ని విష్ణుపురాణం వివరిస్తుంది. సర్వసంపదలకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, యశస్సులకు మూలకారణమైన ఈ తల్లిని శ్రావణమాసంలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు పూజిస్తే సర్వసౌభాగ్యాలు సమకూరుతాయని పరమశివుడు పార్వతికి చెప్పినవిధంగా కలియుగంలో స్ర్తిలందరూ వరలక్ష్మిదేవిని పూజించి ఆ తల్లఅనుగ్రహాన్ని పొందు తున్నారు.
నమోస్తు నాళీక నిభాననాయై , నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సౌమామృతసోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై
అని ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లినే కొనియాడారు. ఈ తల్లిని పూజించని వారు ఎవరూ లేరు. ఈమె మొట్టమొదట వైకుంఠంలో నారాయణుని చేత పూజలందుకుంది. ఆ తర్వాత దేవతలు, స్వాయంభువ మనువు, తర్వాత ఋషులు, మునీంద్రులు, మానవులు ఇలా అందరూ అర్చించడం జరుగుతూ వస్తోంది. ఈమే స్నిగ్థదృష్టులతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది గనుగ ఈ దేవిని మహాలక్ష్మి అన్నారని దేవీ భాగవతం చెప్తోంది. ఇటువంటి ఈ తల్లే సర్వసంపత్స్వరూపిణియై స్వర గలక్ష్మిగా, నాగలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా, గృహలక్ష్మిగా, కామ ధేనువుగా, దక్షిణాదేవిగా, క్షీరసముద్ర రాజ తనయగా, శోభాలక్ష్మిగా, తేజోలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, వీర లక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, గజలక్ష్మి గా, ధనలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా ఇలా మహాలక్ష్మి ఎన్నో అంశావతారా లనుధరించింది.
‘‘్ధవళతరాంశుక గంధమూల్య శోభే’’, అంటూ వరలక్ష్మీదేవికి ఇష్టమైన శే్వత వస్త్రాలని అంటే స్వచ్ఛత తల్లికి ఇష్టమని స్వచ్ఛతకు మారుపేరుగా ఉండే శే్వత వర్ణ పుష్పాలతో పూజిస్తే తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుందనీ అంటారు.
పద్మప్రియే! పద్మిని!పద్మహస్తే!
పద్మాలయే! పద్మదళాయ తాక్షి!
విశ్వప్రియే! విష్ణు మనోనుకూలే! అంటూ తల్లిని కీర్తించిన వారికి స్మరించిన వారికి ఆ తల్లి అనుగ్రహం సదా ఉంటుంది.

- చివుకుల రామమోహన్