Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతివ రాముని తలను ముత్యాలు పోసె
కడలిలో ముత్యాలు కలిపెనో యనగ.

రాముండు సీతను నీలాల ముంచె
కడలిరాయడె నీట ముంచెత్త ననగ.

సీత కన్నులలోన రాముండు దాగె
రాము నవ్వులలోన దొరలె సీతమ్మ.

ఆమె కన్నులతోడ నవ్వగా సాగె
అతడు వౌనముగానె మాటాడసాగె.

అందరకును పెండిలిని అగ్నియే సాక్షి
అగ్నివంటి సీతకెవరోయి సాక్షి?

మంత్రమ్ములే సాక్షి సృష్టియే సాక్షి
వారి పెళ్ళికి వారి ఆత్మలే సాక్షి.

శీతకన్నులవాడు రాముడే సీత
గాంభీర్యముల ప్రోవు రామ రాముండె.

కొమ్మ చేతుల నొక్క పూవాయె నతడు
పూవు గుండెను పరిమళమ్మాయె సీత.

బుగ్గపై నాతండు చిటికేసెనేమొ?
చిటికెలో బుగ్గలను సిగ్గుల్లుపూచె.

ఇంకావుంది...