AADIVAVRAM - Others

చినుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకులు
చినుకులు చినుకులు
గాలిలో
రెక్కలు విప్పిన
రంగుల
సీతాకోకచిలుకలు
చినుకులు
చినుకులు చినుకులు
పిల్లల
పెదవులపై
పురివిప్పిన నవ్వులు
చినుకులు
చినుకులు చినుకులు
చెట్టులు కూసెను
పక్షుల
కిలకిలరావాలు
చినుకులు
చినుకులు చినుకులు
గరికపై
విరబూసిన
తేమ తుషారాలు
చినుకులు
చినుకులు చినుకులు
సంగీత సొబగుల
జలతరంగములు
చినుకులు
చినుకులు చినుకులు
నిండిన మడుగుల
పిల్లల చిందులు
చినుకులు
చినుకులు చినుకులు
అంబరాన
ఇంద్రచాపమై వెలిసెను
ఏడు రంగులు
చినుకులు
చినుకులు చినుకులు
తలపైరాలెను
దేవుని ఆశీస్సుల
అక్షింతలు.

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655