Others

పెదరాయుడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరించిపోతున్న కుటుంబ బంధాలు, అనుబంధాలు, నీతి నిజాయితీలు, కుటుంబ విలువలకు నిలువెత్తు నిదర్శనం -పెదరాయుడు చిత్రం. మోహన్‌బాబు తన సొంత బ్యానర్‌లో నిర్మించి ద్విపాత్రాభినయం చేసిన ఉదాత్త చిత్రంలోని ప్రతి సన్నివేశం ఉద్వేగ భరితం. ప్రతి డైలాగ్ అర్థవంతం. కథాపరంగా చూస్తే -దయార్థహృదయం కలిగిన ఊరి మోతుబరి పెదరాయుడు (మోహన్‌బాబు). ఊరిజనం సమస్యలకు పరిష్కారం చెబుతూ -తప్పుచేసిన వాళ్లను దండిస్తుంటాడు. అతని భార్య లక్ష్మి (్భనుప్రియ)కి భర్తంటే ఎనలేని గౌరవం. రాజా (మోహన్‌బాబు), రవీంద్ర (రాజా రవీంద్ర) పెదరాయుడు తమ్ముళ్లు. రాజా ఓ పారిశ్రామికవేత్త (సత్యనారాయణ) కుమార్తె భారతిని పెళ్లి చేసుకుంటాడు. పెదరాయుడి వరస నచ్చని భారతి ముందు తప్పుగా ప్రవర్తించినా, ఓ సన్నివేశంలో బావగారి గొప్పతనం తెలుసుకుని మారుతుంది. ఇదిలావుంటే రెండో తమ్ముడు రవీంద్ర -పెదరాయుడి చేతిలో శిక్షించబడిన భూపతి కుతూర్ని ప్రేమించటంతో వివాదం చెలరేగుతుంది. పెదరాయుడి కుటుంబంపై భూపతి ఎందుకు పగతో రగులుతున్నాడు? సొంత చెల్లి కుమారుడని కూడా చూడకుండా భూపతి చేసిన తప్పుకు పెదరాయుడి తండ్రి పాపారాయుడు (రజనీకాంత్) ఎలాంటి శిక్ష విధించాడు? ఇలా అసలు కథ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ సీన్‌లో రజనీకాంత్ నటన మాటల్లో చెప్పలేం. తన చెల్లి కొడుకు తప్పుచేస్తే శిక్షించే విధానం, తన చెల్లికి ఆస్తిమొత్తం ధారాదత్తం చేస్తానని చెప్పడం.. కుర్చీల అంచుల్లో కూర్చుని చూడాల్సిన సన్నివేశాలవి. నీతిని బతికించేందుకే పాపారాయుడు, పెదరాయుడు ప్రాణాలు వదిలేయటం ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీరు పెట్టిస్తుంది. సినిమాలోని ప్రతి మాట, పాట అద్భుతం. రజనీ, మోహన్‌బాబుల తరువాత -ఆనంద్‌రాజ్, భానుప్రియ, సౌందర్య, జయంతి, చలపతిరావు ఎవరికివారే పోటీపడి నటించారు. ఏ పాత్రా మర్చిపోలేనంత బిగింపుతో ఉంటుంది కనుకే -ఈ సినిమా నాకు చాలా ఇష్టం. ఓ మంచి సినిమా -పెదరాయుడు.

-కురువ శ్రీనివాసులు