Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళ
నేనిక్కడ ఎత్తిన గొంతు
ఆకాశాలు ఒరిసే అడవుల నిశ్శబ్దంలోంచి
పల్లవశ్రేణులై ప్రతిధ్వనిస్తుంది..
ఇవాళ నా పాట
నిదురించే గ్రామరధ్యల్లో
కర్తవ్య రుధిర ప్రవాహమై
మానవాభ్యుదయ రోచిర్నివహాన్ని అభిషేకిస్తుంది..

ఇవాళ నా
లలాటం రాల్చిన ఒక్క స్వేద బిందువే
ఊహల పొడి మన్ను తడిపి
ఉత్ప్రేక్షగా ఎదిగిన పంటచేతల పర్యవసానంగా
సింధువంత చరిత్రని ఆవిష్కరిస్తుంది..
వాచ్యం కాని ఒక యోగ భాషా శిల్పం
నా వౌన సమాధి నుండి
పదపల్లవాన్ని పేలుస్తుంది
మనిషికది ఆలోచనల అగ్నిగుండం..
దృశ్యాన్ని తడిపిన దుఃఖంలో
కావ్యంగా మలచుకొన్న ‘మానిషాదమే’ వుంది
ఇంకా ఉంది

- సాంధ్యశ్రీ, 8106897404