Others

పిల్లల్లో దేశభక్తి పెంచాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న సిద్ధాంతం నిజం చేయాలంటే చిన్నారులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అదే విధంగా పిల్లలకు చదువు సంస్కారంతోబాటు వారిలో చిన్ననాటినుండే దేశభక్త్భివం పెంపొందించాలి. భారతదేశం మనదేశం, మన దేశ స్వాతంత్య్రం కోసం కృషిచేసిన మహనీయుల త్యాగఫలితమే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని పెద్దలు పిల్లలకు సవివరంగా తెలియజెప్పాలి.
చిన్నప్పటినుండే పిల్లల్లో దేశభక్త్భివం అనేది నేర్పించాలి. అలా నేర్పిస్తే వారు పెద్దయిన తరువాత మంచి నేతలు కాగలరు. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్న సామెతను అనుసరించి పిల్లలకు చిన్ననాటినుండే దేశభక్తి గాధలు, దేశభక్తి గీతాలు వినిపించాలి. దేశభక్తి భావం వలన వారిలో విజ్ఞాన చైతన్యం వికసిస్తుంది. మన దేశం కీర్తిప్రతిష్ఠలు వారిలో ఇనుమడింపజేస్తాయి.
మన దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కృషిచేసిన మహనీయుల జీవితగాథలు పిల్లలకు ఆదర్శవంతం కావాలి. అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి, ఛత్రపతి శివాజి, సుభాష్‌చంద్రబోస్, మహాత్మాగాంధీ, చాచా నెహ్రూ, ఇందిరమ్మ వంటి మహనీయుల జీవితగాధలు పిల్లలు చదవాలి.. చదివింపజేయాలి.
‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అన్న ఆర్యోక్తిని అనుసరించి ఈ దేశ చరిత్రలో త్యాగం చేసిన మహనీయులు ఎందరో వున్నారు. వారి జీవిత గాథలు పిల్లల్లో దేశభక్త్భివం మరింత ఉత్సాహం కలిగిస్తాయి. అందుకని పెద్దలు చిన్ననాటినుండే పిల్లలకు వీరోచిత దేశభక్తి గాథలు వినిపించాలి. సమరయోధుల చరిత్రలు చదివి వారికి కథలు కథలుగా వివరించాలి.
చైతన్యం, స్ఫూర్తి, ఆశయ సాధన దేశభక్త్భివం ద్వారా మనకు అలవడతాయి. మహనీయుల బోధనలు సైతం ఆదర్శం కాగలవు. ఉదాహరణకు ‘్భరతభూమి మనది, నవభారత భూమి మనది’ అన్న దేశభక్తిగీతం, ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశం’, భారతమాతకు జేజేలు, పాడవోయి భారతీయుడా, తెలుగువీర లేవరా అన్న గీతాలు వినడం ద్వారా పిల్లల్లో దేశభక్త్భివం మరింత ప్రకాశిస్తుంది. మనదేశం పట్ల ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. చిన్ననాటినుండే పిల్లలకు దేశభక్తి భావంవలన వారికి పెద్దయ్యాక చక్కని జ్ఞానం అలవడుతుంది. రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి దేశభక్త్భివం ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు పెద్దలు ప్రతినిత్యం కృషిచేయాలి.

- ఎల్. ప్రపుల్లచంద్ర 88865 74370