Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహించు...
నాగేటిచాళ్ళు పైరు పచ్చల్ని నవ్వుతున్నపుడు
కఱ్ఱు తగిలి నేల గాయపడిందనుకున్నవాడి
గా తిని కడిగేందుకు
గంధ ఖనిజాక్షరాలనే ఎంచుకుంటాను- వాడి
వక్షశ్శాద్వల సీమ మీద నా కవోష్ణకిరణాల
హిరణ్యం చల్లుతాను...
మా ఊరు నుంచి వసంతం వెళ్లిపోయినప్పుడు
చెట్లు
అనార్ద్రమైన ఎండ కన్నుకు బలియైపోయాయి
దిగులు బరువుపూస్తున్న కొమ్మలమీద
తుమ్మెదలు నాదాసక్తంగా ఎగరటం లేదు
సరిహద్దుల్ని చీల్చుకొని
చల్లగాలులు సెలవంటున్నప్పుడు
భూమి అనే వాక్యం
అర్థరహితమైన శుష్క వచనంలా వుంది
చరిత్ర రక్తాన్ని
హృదయాంతర్వాహినిగా చేసుకున్న నాకు
మరణమొక అధ్యాస కాదు
ఇవాల్టి ఈ చీకటి ముగుస్తుందని తెలుసు
రేపు వేకువని తొడుక్కొని
వస్తుందనీ తెలుసు...

ఇంకా ఉంది

- సాంధ్యశ్రీ, 8106897404