Others

వాజ్‌పేయి వచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(2019 ఆగస్టు 16 ప్రథమ వర్థంతి సందర్భంగా)
*
గతములోపలి మంచి రక్షణ
హితముగా భావించి నడువుడు
ప్రగతి కాముక నావములతో
ముందుకే సాగాలి నమ్ముడు

తనదు హక్కుల స్పృహను వదలక
బాధ్యతాయుత కార్యక్రమముల
నిర్వహిస్తూ జాగరూకత
కలిగి ఉండాలీ సమాజం
భౌతిక సుఖము సంపదలతో
తనకు తానిలదొక్కుకోవలె
వ్యక్తిగత సామర్థ్య మాతని
ధనముతో కొలువంగరాదు

భారతీయ సమాజమందున
ఎట్టి సంఘర్షణలు లేని
శాంతియుతమగు సామరస్యపు
భారతము నిర్మించుకోవలె

అక్షరాస్యత అంతటుండే
కార్యశీలత కదనుత్రొక్కుడు
ఆకలజ్ఞానమ్ము లేనీ
ధాత్రగా ఇది వెలిగిపోవలె

శాంతియుత భారతముకోరుడు
శాస్తవ్రిజ్ఞానమ్ము కోరుడు
భరత ప్రజసంక్షేమకాంక్షతా
శాస్తజ్ఞ్రానము విస్తరించుడు

ఈ ప్రపంచమునందు భారత
భవ్యస్థానము నెలకొనంగా
నవ్యవిశ్వాసాన కదలుడు
దివ్య స్థానములోన నిలుపుడు

వినుడు సాంకేతికముగా - వి
శ్వాన నిలువగ తీర్చి దిద్దుడు
శక్తిమంతమ్మయిన సుందర
భారతావనిగా నొనర్చుడు

శాంతి భద్రతులపయి దృష్టిడి
ప్రజారక్షణ చేసి నప్పుడె
మానప్రాణాల్ మహిని నిలుచును
సుఖము భాగ్యము ప్రజల కందును

నిర్ణయాత్మక పాలనమ్మును
నీతి గలిగిన పాలనమ్మును
సుస్థిరమ్మగు పాలనమ్మును
శుభములిచ్చును పాలితాళికి

నవ్యభారత నిర్మాణానికి
సుదృఢమ్మగు ప్రభుత కావలె
నవ్య భారత నిర్మాణానికి
పారదర్శక ప్రభుత కావలె

నవ్యభారత నిర్మాణానికి
నిత్య చేతన ప్రభుత కావలె
నవ్య భారత నిర్మాణానికి
ప్రజా రక్షక ప్రభుత కావలె

- ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 9866956250