Others

భగవానుడు కృష్ణుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ పరమాత్మ పదహారు కళలతో ప్రభవిల్లిన పరిపూర్ణ అవతారము శ్రీకృష్ణావతారము. భగవదవతారములలో శ్రీకృష్ణావతారమునకున్న ప్రత్యేకత, విలక్షణత ప్ర త్యేకమైంది. కర్షయతీతి కృష్ణః సమస్త హృదయములను ఆకర్షించువాడు ఆయనచే ఆకర్షింపబడని ప్రాణి అంటూ లేదు. జీవాత్మను ఆకర్షించు పరతత్త్వము ఆయన. కలియు గంలో మానవుడు ఎలా మెలగాలో, ఏమి చెయ్యాలో భగవద్గీత మూలమున మార్గదర్శనం చేసిన జగదుర్గువు శ్రీకృష్ణుడు. గీతోపదేశం ద్వారా మనిషి పుట్టుక నుండి మోక్ష ప్రాప్తివరకు వివరించి మానవులకు ధర్మ మార్గాన్ని మానవ రూపంలో బోధించాడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు.
‘రసో వైసః’ అతడు రస స్వరూపుడు. యశోదా గృహము చేరగానే గోకులమున రస స్వరూపము వికసనమొందినది. గోకులములోని సమస్త జనులకు, సకల జన చేతనములకు ఉత్కృష్ట రసయగము సిద్ధించినది. అదిఒక అద్భుత లీల. యోగమాయవలన కంసుడు సహితము రసపూర్ణుడైనాడు. సంయోగ వియోగములలో ‘యోగ’మున్నది. పరమాత్ముని చేరుటకై జీవుని వేదన ఒక యో గము. గోప స్ర్తిల విరహవేదన ఒక యోగము, అర్జునుని విషాదము ఒక యోగ ము. ఇట్టి యోగములన్నియు మహా యోగేశ్వరేశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మ తనలో పర్యవసింపచేసుకొనినాడు. స్వామి నారాయణ, గౌడీయ, వల్లభాచర్య, నింబార్క మొదలగు సంప్రదాయాలవారు ‘కృష్ణస్తు స్వయం భగవాన్’ అనే సంభావన చేస్తారు. ఒడిషాలో జగన్నాథునిగా, మహారాష్టల్రో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా ఆరాధిస్తారు. మణిపూర్ ప్రాంతంలో రాధాసమేతుడైన కృష్ణునే్న ఆరాధిస్తారు చైత న్య మహాప్రభు, ఏకనాథ్, నామ్‌దేవ్, తుకారామ్, సూరదాస్, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, పురందరదాస్, జయదేవుడు, అన్నమయ్య, సదాశివబ్రహ్మేంద్రులు వంటి భక్తశిఖామణులు కలియుగంలో భగవన్నామ సంకీర్తనమే సర్వపాపహరము, ముక్తిప్రదము అని భావించి శ్రీకృష్ణలీలా సంకీర్తనంతో, గోవింద గుణగానంతో తరించి ధన్యులయ్యారు. మనమూ ఆ కృష్ణనామాన్ని పలికి పులకించి పోదాం రండి.

- చివుకుల రామమోహన్