AADIVAVRAM - Others

నీవు.. నీవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదామినులకు పుట్టినిల్లుగా భాసించే
నీ సొగసైన నీలినీలి కళ్లతో
చూసీ చూడని చూపు చూసి
ఏమీ తెలియనట్లుగా సవ్వడి చేయకుండా
ఆనాడు వడివడిగా వెళ్లిపోయావు!
కానీ.. అప్పటి నుండి ప్రగాఢ ప్రశాంతమైన
నిద్రకు దూరం చేసినావు!
నీ గురించిన కలలకు తప్ప-
వేరే కల లన్నింటి చేతా శాశ్వతంగా
సెలవు చీటీల నిప్పించినావు!

వసంతాలకు నిర్వచనం చెప్పే
నీ విరిసీ విరియని చిరునవ్వుతో
తొలిసారిగా ఏవేవో
అనిర్వచనీయానుభూతులను కలిగించి,
కౌమార ప్రేమను రగిలించి,
ఆకాశమంత ఎత్తుకు ఎగిరించి
హుషారుగా ‘సీటీ’ (ఈల) కొట్టడం నేర్పించినావు!
ఈరేడు లోకాలలో
మహారాజకుమారుల వలె
స్వేచ్ఛగా విహరించే ఆలోచనలను -
నీ చిక్కని నల్లని కురులనింగి యొక్క
తళుకు బెళుకుల వలతో గుంజుకుని
నీ రెండు జడలతో బందీల చేసినావు!
నా హృదయ సింహాసనాసీనురాలవై
నీ నామస్మరణ చేయిస్తున్నావు!

సకల సౌందర్యరాశీ.. ఓ ప్రేయసీ..
నా భావనల పద్మాలకు సూర్యబింబం నీవు
నా భావనల కలువలకు చంద్రబింబం నీవు!!

-రఘువర్మ 92900 93933