AADIVAVRAM - Others
చీకటి రోదన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 August 2019
-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505

ధనము దర్పము ధరనేలుతున్నవి
పదవులు పెత్తనములు గుత్తగ జమానా నడిపిస్తున్నవి
నీవు పుట్టినప్పటికి.. నేటికి...
స్వాతంత్య్రమా పరతంత్రవే నీవింకను..
నీవు తెచ్చిన మార్పు లేదు.. ఓదార్పు లేదు
దానికెన్నటికి నీ నుండి
సరైన తీర్పు లేదు.
తెల్లదొరలు చెఱ పెట్టిండ్రు ఆనాడు
నల్లదొరలు నిన్నంగట్లకు నెట్టినారు నేడు
సగటు బడుగు బీదా బిక్కీ దళితుడు
సామాన్యుడు జట్కాబండి లాగలేక...
యధార్థాన్ని మింగలేక కక్కలేక
వల్లకాటి కెళ్లలేక ఇంటి దారి మళ్లలేక
బంజరు బీడై మోడై మిగిలి
జీవచ్ఛవమై మనుగడ సాగించలేక
సాగిలపడి లాగిస్తున్న యాంత్రిక జీవనం
కాదెన్నడు అభ్యుదయానికి వీవనం.