Others

టౌను పక్కకెల్లొద్దురో.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌను పక్కకెల్లొద్దురా డింగరీ/ డాంబికాలు పోవద్దురా/ టౌను పక్కకెళ్లేవు డౌనైపోతావురో.. రబ్బీ బంగారు సామి. ఘంటసాల, జిక్కి ఆలపించిన ఈ పాట అన్నపూర్ణావారి ‘తోడికోడళ్లు’ చిత్రంలోనిది. పాట రచన కొసరాజు రాఘవయ్యచౌదరి. సంగీత స్వరాలను మాస్టర్ వేణు సమకూర్చారు. చిత్రంలో పాట సందర్భం -ఉమ్మడి కుటుంబంలో తోడికోడళ్ల మధ్య సహజంగా వచ్చే ఈర్ష్యా అసూయల నేపథ్యంగా ఉంటుంది. ఒకరు రగిల్చే ద్వేషాలకు దూరంగా ఉండి ప్రశాంత జీవనం గడపాలన్న ఆలోచనలకు యువ దంపతులు వస్తారు. గ్రామంలో పొలం సాగుచేసుకొనే జీవనంలో పండుగరోజు జరిగే నృత్య రూపకం సందర్భంలో వస్తుందీ పాట. పాటలో ఇవి సరోజ, చిత్ర నృత్య దర్శకుడు ఎకె చోప్రా కలసి అభినయించారు. పాటలో అక్కినేని, సావిత్రి కనిపిస్తారు. ఆ రోజుల్లో ఎక్కువశాతం గ్రామీణ యువత పట్టణాలపై మోజుతో పల్లెవిడిచి వలసరావడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, నగర పాలనావ్యవస్థ అదుపుతప్పేక్రమంలో అలాంటి వాళ్లకు చురకలంటిస్తూ మేలుకొలుపుగా కొసరాజు రాసిన పాట ఇది. పాటలో యువకుడు టౌనుకెళ్లి డబ్బు సంపాదించి హాయిగా ఉందామన్న ఆలోచన చెప్తే, పట్నపువాసాలతో బతుకే దుర్భరమవుతుందని, పిల్లలు చెడిపోతారని హెచ్చరిస్తుంది. గొడ్డు గోదా, కోళ్లు మేకలు మేపుకుంటూ గుట్టుగా పరువుగా బతుకుదామని చమత్కార చెణకులతో చెబుతుంది. గ్రామాల్లో ఇరుగు పొరుగు ఆత్మీయతలు, తప్పుచేస్తే పెద్దల మందలింపులు, ప్రేమ ఆదరణ ఏదైనా సొంతూళ్లోనే ఉంటుందని, పట్టణాల్లో మనసులు ఇరుకై యాంత్రిక జీవనమైపోతుందని కొసరాజు వాతలుపెట్టి మరీ సంధించిన చమత్కార గీతమిది. పాట హుషారుగా సాగుతుంది. పాటను వింటే విషయం అర్థమవుతుంది.

-పీవీఎస్ ప్రసాద్, అద్దంకి