Others

పరమభక్తాగ్రగణ్యులు గోపికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలప్రభావం వల్ల భగవంతుని అస్తిత్వాని ఎందరో శంకిస్తున్నారు. ఆయన దివ్యలీలను ఎంతమంది విశ్వసించి ఆరాధిస్తున్నారు. మిడి మిడి జ్ఞానం గలవారు ప్రమాదకారులుగా ఉంటారు. దైవ దర్శనం కావాలంటే అంతరదృష్టిగావాలి. అది లేనివారికి అర్థం కాదు.
యమ్ వైషవృణుతే తేనలభ్యః అని వేదోక్తి. భగవతత్త్వాన్ని విని ఆనందించే వారినే భగవంతుడు స్వీకరిస్తాడు. కరుణతో తన యోగ మాయ అను యవనికను తొలగించి వారికి దర్శనమిచ్చి తన స్వరూపాన్ని వివరిస్తాడు.
భక్త శిఖామయులైన గోపికల కంటే భగవత్ స్వరూపస్వభావాలను తెలుసుకొన్నవారు మరెవ్వరూ లేరు.
గోపికాగీతలో గోపికలు శ్రీకృష్ణుని గాంచి నీ దివ్యరూపం ప్రసాదించమని కోరుతూ..
‘నీవు యశోద మిడ్డడవె నీరజనేత్ర! సమస్త జంతుచే
తోవిధితాత్మ వీశుడవు తొల్లి విరించి దలంచి లోకర
క్షావిధమాచరింపు..’అని వేడుకున్నారు.
నీవు మా విరహ నీ వియోగ బాధను హరించి మాకు నీ దివ్యరూపం ప్రసాదింపమని వేడారు గోపికలు.
గోపికలిద్దరూ పరస్పరం సంభాషించుకుంటూ ఈ కృష్ణుడు మన యశోద పుత్రుడా? గోకులంలో జన్మించాడా? మకోససమా? బ్రహ్మదేవుని ప్రార్థనతో లోక కల్యాణంకోసం యదువంశంలో పుట్టాడా ఈ పురుషోత్తముడు ప్రాణుల అంతరాత్మగా ఉన్న పరమాత్మ యితడే అని ఈ శ్రీకృష్ణుడు గోపికానందనుడే. కావున మన మనస్సులో గల విరహవేదన ఈయనకు తెలిసే ఉంటుంది. బ్రహ్మమ ప్రార్థించగా విశ్వరక్షణకై బృందావనంలో అవతరించారు. మనం కూడా ఈ విశ్వంలోని వారిమే కదా. కనుక మనలను కూడా రక్షితులమవుతాం. ఈ భగవానుడు అంతఃకరణ ప్రేరకుడై సర్వాంతరాత్ముడై జీవకోటి కి సనాతన సఖునిగా హితుని గా ఉన్నాడు.
‘ద్వాసుపర్ణాసయుజా సఖాయా’ అని వేద వాక్యం జీవాత్మకు సఖుడీయన. ప్రాణులందరికీ బుద్ధి సాక్షి అయిన వాడు. తన స్నేహభావాన్ని తెలుపుటకై సత్వగుణ సంపన్నుడైన వైష్ణవుల కులంలో అవతరించాడు. ఇలా అనుకొంటూ కృష్ణునితో నిరంతరమూ మాట్లాడుతున్నప్పటికీ ఇంకా మాట్లాడాలనే నెపంతో కృష్ణుని దగ్గరకు గోపికలు తరలి వెళ్లారు.

- పి.వి. సీతారామమూర్తి, 9490386015